Telangana: ఓర్నీ.. ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..

| Edited By: Velpula Bharath Rao

Dec 22, 2024 | 9:28 AM

జగిత్యాలలో శునకాలకు ఘనంగా బారసాల చేయడం అందర్నీ ఆశ్యార్యానికి గురిచేసింది. ఓ పెంపుడు కుక్క ఇటివల ఐదు పిల్లలకి జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట్లో‌ సందడి వాతావరణం నెలకొంది. జన్మనిచ్చిన ఐదు పిల్లలకి ఘనంగా బారసాల నిర్వహించి ఆ కుటుంబసభ్యులు తమ‌ జంతు ప్రేమని చాటుకున్నారు.

Telangana: ఓర్నీ.. ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
Dog Barasala
Follow us on

శునకం అంటేనే విశ్వాసానికి ప్రతీక.. కాస్తా అదరిస్తే నిత్యం విశ్వాసంగా‌ ఉంటుంది. ఎవరైనా శత్రువులు వస్తే వాటి తాటా తీస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క ఇటివల ఐదు పిల్లలకి జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట్లో‌ సందడి వాతావరణం కనబడింది. అంతేకాకుండా జన్మనిచ్చిన ఐదు పిల్లలకి ఘనంగా బారసాల నిర్వహించి తమ‌ జంతు ప్రేమని చాటుకున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో హనుమాన్ వాడకి చెందిన అయ్యోరి సుధాకర్, రేవతి‌ దంపతులు సిజ్జు జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. మూడేళ్ళుగా కుక్కను పెంచుకుంటూ తమ ప్రేమని చాటుకుంటున్నారు. ఇటివల ఈ పెంపుడు కుక్క ఐదు కుక్క పిల్లలకి జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తరువాత ఇరవై ఒక్క రోజు ఈ పిల్లలకి బారసాల నిర్వహించారు. వాటికి నూతన వస్త్రాలతో అలంకరణ చేశారు. ప్రత్యేకంగా ఉయ్యాలను కూడ ఏర్పాటు చేశారు. కొంతమంది బంధువులతో పాటు‌, స్థానికులని కూడా ఈ బారసాల వేడుకకి పిలిచారు. బారసాల పాటలు పాడడం ఈ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాకుండా పసందైనా విందును కూడ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులకి కడుపునిండా భోజనాలు పెట్టారు. అంతేకాకుండా ఈ కుక్క పిల్లలని చూసి స్థానికులు మురిసిపోయారు. ఈ కుక్కను తమ కుటుంబ సభ్యునిలో ఒకరోజుగా భావించి పెంచుకున్నామని యజమానులు చెబుతున్నారు. మా కుటుంబ సభ్యురాలు కావడంతోనే ఎంతో ప్రేమతో బారసాల నిర్వహించామని తెలుపుతున్నారు. ఈ వేడుకలలో పాల్గోన్న అతిథులకి ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి ఈ బారసాల వేడుక జగిత్యాల లలో హట్ టాఫిక్‌గా‌ మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి