Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో సారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుపువణాల ప్రభావంతో రెండు తెలుగురాష్ట్రాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాబట్టి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Latest Weather Report For Andhra And Telangana

Updated on: Jul 31, 2026 | 7:52 AM

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. ఇప్పటికే తగ రెండు మూడు రోజులు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరోసారి వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. అల్పపీడనం తొలగిపోయినప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి తేటిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్.. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్‌లో వాతావరణం ఇలా

ఇక హైదరాబాద్‌లో ఉదయం చివరి నుండి మధ్యాహ్నం వరకు మధ్యమధ్యలో ఎండ వస్తుందని.. అయితే, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ – మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుంది, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా

వాయుగుండం ప్రభావంతో అటు ఏపీలో కూడా శక్రవారం మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. శుక్రవారం ఉత్తరాంధ్రలోని మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి.. కోస్తాలోని పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us