Telangana: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరో పోలీసు ఉన్నతాధికారి.. రేపు రాజీనామా ప్రకటించే అవకాశం..

|

Jul 25, 2021 | 7:59 AM

Telangana: తాజా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు దళిత ఆఫీసర్లు పయనించేందుకు సిద్ధమయ్యారు.

Telangana: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరో పోలీసు ఉన్నతాధికారి.. రేపు రాజీనామా ప్రకటించే అవకాశం..
Police Officer
Follow us on

Telangana: తాజా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు దళిత ఆఫీసర్లు పయనించేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ మాదిరిగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు కొందరు ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు. తాజాగా డీఎస్పీ విష్ణుమూర్తి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసు శాఖలో దళిత అధికారులను వేధిస్తున్నారని మనస్తాపం చెందిన ఆయన.. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో పోస్టింగ్స్‌ విషయంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు డీఎస్పీ విష్ణుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డీఎస్పీ విష్ణుమూర్తి సోమవారం నాడు తన రాజీనామా లేఖను డీజీపీ మహేందర్ రెడ్డికి సమర్పించనున్నట్లు సమాచారం. హుజూరాబాద్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని విష్ణుమూర్తి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సెక్రటరీగా పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సోషల్ వెల్‌ఫేర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన నేతృత్వం రాష్ట్రంలో ఎన్నో గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు గురుకుల విద్యాలయాలు మరింత చేరువయ్యాయి. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. వాస్తవానికి ఆయన రిటైర్మెంట్‌కు ఇంకా 5 ఏళ్లకు పైగానే సమయం ఉంది. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రవీణ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. దళితులకు అండగా ఉండేందుకు.. రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించారు కూడా. అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుజారాబాద్ ఎన్నికల బరిలో నిలుస్తారా? లేదా? అనేది చూడాలి.

Also read:

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; నిరాశ పరిచిన మనూ బాకర్, యషస్విని దేస్వాల్

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Gold and Silver Price Today: తటస్థంగానే పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో..