తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం రేగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది డ్యాం వద్దకు వెళ్లగా.. అక్కడి ఆంధ్రప్రదేశ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ‘తెలంగాణ వారికి మీకు ఇక్కడేం పని?’ అంటూ వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య రచ్చకు అజ్యం పోసింది..
మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ప్రతిరోజు తెలంగాణ డ్యాం సిబ్బంది రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ ను నోట్ చేసుకుంటారు. యధావిధిగా శనివారం(నవంబర్ 9) రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఆంధ్ర సిబ్బంది ఆదుకోవడంతో మరోసారి ఈ వివాదం కలకలం రేపింది.
దీంతో నాగార్జునసాగర్ డ్యాంపై నీటి మంటలు ఇంకా చల్లారడం లేదు. కొంత కాలంగా తరచు వివాదాలకు కేరాఫ్ గా నాగార్జునసాగర్ డ్యాం మారుతోంది. గత ఏడాది నవంబర్ 28న సాగర్ డ్యాం పై ఎరువు రాష్ట్రాలకు చెందిన పోలీస్ బలగాలు మొహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీగా బలగాలను మొహరించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం అప్పగించింది. తాజాగా నాగార్జునసాగర్ లో ఈ వివాదం మరోసారి తలెత్తింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..