Sangareddy: కోళ్ల ఫామ్‌లో పోలీసుల తనిఖీలు.. ఏం దొరికిందో తెలిస్తే బిత్తరపోతారు

|

Jun 18, 2024 | 9:50 PM

మాదక ద్రవ్యాల్లో అల్ఫాజోలం కొకైన్(Cocaine Drug) కంటే ప్రమాదకరమని, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. తాజాగా పెద్ద మొత్తంలో అల్ఫాజోలం పట్టుబడటం కలకలం రేపింది.

Sangareddy: కోళ్ల ఫామ్‌లో పోలీసుల తనిఖీలు.. ఏం దొరికిందో తెలిస్తే బిత్తరపోతారు
Poultry Farm
Follow us on

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. జిల్లాలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కొత్తపల్లి శివారులోని కోళ్ల ఫామ్ లో అల్ఫాజోలం అనే మత్తు పదార్ధాన్ని గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ అల్ఫాజోలం విలువ కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు పోలీసులు. దీంతో పోలీసులు 2.6 కేజీల నిషేధిత ఆల్ఫా జోలం డ్రగ్స్ ను సీజ్ చేశారు. తెలంగాణ నార్కోటిక్స్ జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అల్ఫాజోలం డ్రగ్స్ ని పట్టుకున్నారు. అల్ఫాజోలం మత్తు పదార్ధాన్ని సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించారు పోలీసులు. అంజిరెడ్డి, రాకేష్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి పరారిలో ఉన్నట్లు చెప్పారు. మరోవ్యక్తి అల్రేడీ జైల్లో ఉన్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ రూపేష్. పరారీలో ఉన్న ప్రభాకర్ గౌడ్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

 మాదక ద్రవ్యాల్లో అల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదకరమని, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.  తెలంగాణలో అల్ఫాజోలం పలువురి చేతులు మారటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే సంకల్పంగా బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రగ్స్ రవాణా, వినియోగం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదంతో అణచి వేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..