Agri Gold Scam: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం.. చైర్మన్ సహా ఇద్దరు ప్రమోటర్లను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు..

|

Dec 29, 2020 | 4:45 PM

అగ్రిగోల్డ్ చీటింగ్ కేసులో అరెస్టైన ఆ సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిథులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. నేటి నుంచి జనవరి 5వ తేదీ..

Agri Gold Scam: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం.. చైర్మన్ సహా ఇద్దరు ప్రమోటర్లను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు..
Follow us on

Agri Gold Scam: అగ్రిగోల్డ్ చీటింగ్ కేసులో అరెస్టైన ఆ సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిథులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతించింది. దాంతో ఈడీ అధికారులు ఇవాళ చంచల్ గూడ జైలు నుండి అగ్రిగోల్డ్ ప్రతినిధులు ముగ్గురిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు వీరిని ఈడీ అధికారులు విచారించనున్నారు. కాగా, అగ్రిగోల్డ్ స్కామ్‌లో ఆ సంస్థ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌ను ఇటీవల ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, రూ.4,109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.942.96 కోట్ల సొమ్మును ఇతర కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. 7 రాష్ట్రాల్లో 32 లక్షల డిపాజిట్ల ద్వారా రూ.6,380 కోట్లను అగ్రిగోల్డ్ సేకరించింది. మనీలాండరింగ్‌పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.

 

Also read:

varun tej corona positive : మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు పాజిటివ్

Cp waring to drunk and drivers: తాగి వాహనం నడుపుతున్నారా.? అయితే మీరు తీవ్రవాదే.. ఈ మాట అంటోంది ఎవరో కాదు.