Telangana: పోలీసుల పహారాలో ఆ ప్రదేశం.. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్‌

| Edited By: Narender Vaitla

Sep 28, 2024 | 11:53 AM

దండకారణ్యంలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరగుతున్న వేళ ఎపుడు ఏమి జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి మావోయిస్టుల కాల్పులు మొదలవటంతో క్యాంపులోని భద్రతా బలగాలు అప్రమత్తమై ధీటుగా బదులిచ్చాయి. ఈఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అరగంట పాటు కాల్పులు జరిగాయని వెల్లడించారు...

Telangana: పోలీసుల పహారాలో ఆ ప్రదేశం.. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్‌
Pusuguppa Incident
Follow us on

భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌ నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం పూసుగుప్ప సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేయడంతో తెలంగాణ -ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో కేంద్ర బలగాలు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. పుసుగుప్ప క్యాంపు అటవీ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

దండకారణ్యంలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరగుతున్న వేళ ఎపుడు ఏమి జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి మావోయిస్టుల కాల్పులు మొదలవటంతో క్యాంపులోని భద్రతా బలగాలు అప్రమత్తమై ధీటుగా బదులిచ్చాయి. ఈఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అరగంట పాటు కాల్పులు జరిగాయని వెల్లడించారు. మావోయిస్టులు బీజీఎల్ (బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్)లను వినియోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది..చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.. పూసుగుప్ప ఘటన నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీ లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఛత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణకు వచ్చేవారిని తనిఖీ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. కేంద్ర బలగాలు చర్ల నుంచి పూసు గుప్ప రహదారి వెంట ఆర్వోపీ(రోడ్ ఓపెనింగ్ పార్టీ ) బృందంతో క్షుణ్ణంగా తనిఖీలు సాగిస్తున్నాయి. పూసుగుప్ప బేస్ క్యాంపు చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. భద్రతా బలగాలు వస్తాయనే అంచనాతో మావోయిస్టులు అడవుల్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ లను పెట్టారనే అనుమానంతో బీడీఎస్ బృందాలను రంగంలోకి దించారు. కొద్దిరోజులుగా ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టుల కోటలో భద్రతా బలగాలు పాగా వేస్తున్నాయి.

నక్సల్స్ ప్రభావిత దండకారణ్యంలో బేస్ క్యాంపుల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. ఛత్తీస్గఢ్ నక్సల్స్ కీలక స్థావరాల్లో బేస్ క్యాంపుల ఏర్పాటుకు అడ్డుకట్ట వేయాలనే వ్యూహంతో మావోయిస్టులు పూసుగుప్ప బేస్ క్యాంపుపై కాల్పులకుపాల్పడి ఉంటారని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఓపక్క ఈనెల 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఆవిర్భావ ఉత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దండకారణ్యంలో ఉత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో తెలంగాణలో పూసుగుప్ప క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. ఇటు పోలీసులు..అటు మావోయిస్టులు ఎపుడు ఏమి జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..