
ఓ ఇంట్లో ఏసీ ఆన్ చేసినా కూలింగ్ రావట్లేదు.. ఏమై ఉంటుందా అని ఆ కుటుంబం కంగారు పడింది. ఏసీ రిమోట్‌లో అన్ని బటన్లు నొక్కింది. అలాగే కిటీకీలు, తలుపులు గట్టిగా వేశామో.. లేదో.. చెక్ చేసుకున్నారు. అయినా ఏసీ కూలింగ్ రావట్లేదు. లాభం లేక ఇక టెక్నినిషియన్‌ను పిలిపించగా.. ఏసీ విప్పి చూడగా.. అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.! వేసవిలో ఏసీ కూలింగ్ తగ్గగానే మనం వెంటనే గ్యాస్ అయిపోయిందేమో అని కంగారు పడతాం. కానీ, కొన్నిసార్లు సమస్య మన కంటికి కనిపించేంత చిన్నదిగా ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సాంకేతిక సమస్య ఏసీ మెకానిజంపై అవగాహన పెంచేలా ఉంది.
సాధారణంగా ఏసీలో గ్యాస్ స్థాయిలు సరిగ్గా ఉండి, పైపులు చల్లగా ఉన్నా కూలింగ్ రావడం లేదంటే టెక్నీషియన్లు తలలు పట్టుకుంటారు. ఒక సందర్భంలో అవుట్‌డోర్ యూనిట్ నుండి వేడి గాలి రావాల్సిన చోట, గాలి లోపలికి లాగబడుతున్నట్లు గుర్తించారు. దీనికి కారణం ఏంటని వెతికితే అసలు విషయం బయటపడింది. ఆ ఏసీలోని అవుట్‌డోర్ యూనిట్ ఫ్యాన్ యాంటీ-క్లాక్‌వైజ్ దిశలో తిరగాల్సింది పోయి, క్లాక్‌వైజ్ అంటే రివర్స్‌లో తిరుగుతోంది. ఇలా ఫ్యాన్ రివర్స్‌లో తిరగడం వల్ల కండెన్సర్ కాయిల్ నుండి వేడి గాలి బయటకు వెళ్లకుండా, తిరిగి లోపలికే వస్తుంది. దీనివల్ల కాయిల్ విపరీతంగా వేడెక్కి, ఏసీ తన కూలింగ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే మిషన్ నడుస్తున్నా, గది మాత్రం చల్లబడదు. ఈ సమస్యకు మూలకారణం ఫ్యాన్ కెపాసిటర్ పాడవ్వడమేనని చెప్పొచ్చు. మోటార్ ఏ దిశలో తిరగాలనేది ఈ కెపాసిటర్ నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే పాత కెపాసిటర్‌ను తీసేసి కొత్తది వేస్తామో.. మళ్లీ ఏసీ మునుపటిలా అదిరిపోయే కూలింగ్ ఇస్తుంది.
Also Read: కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది