
స్త్రీని దేవతగా భావించి, కొలిచే ఈ దేశంలో..ఇంకా చాలా చోట్ల స్త్రీల పట్ల వివక్షత మాత్రం తగ్గడం లేదు రోజుకో చోట, ప్రతి పూట స్త్రీల పై దారుణాలు జరుగుతూ ఉన్నాయి..తన సొంత కాళ్లపై నిలబడదా మనుకున్నా మహిళకి తన ఇంటి వాళ్లే యమపాశంగా మారారు..ఎన్నో కలలు కన్నా తన జీవిత భవిష్యత్తుని అత్తవారింటికి వేధింపులకు ఆ మహిళ బలైపోయింది ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులకు శోకాని మిగిల్చి చివరికి ప్రాణాన్ని వదులుకుంది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన కారు హరీష్‌తో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న కళ్యాణి చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉంటూ తన ఎంబీఏ ని పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని ఇప్పట్లో పెళ్లి వద్దని పేరెంట్స్‌కి నచ్చ చెబుతూ వచ్చింది కళ్యాణి. అయితే మంచి సంబంధం వచ్చింది పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయొచ్చని నచ్చజెప్పి కళ్యాణికి వివాహం జరిపించారు.
పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సాపిగా గడిచిన జీవితంతో అత్తగారు కూడా తన ఆశయానికి మద్దతుగా నిలుస్తారని కళ్యాణి భావించింది. ఎంబీఏ చదివినా కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసింది. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కళ్యాణి శిక్షణ కోసం ఎదురు చూసింది. ఇదే తరుణంలో ఉద్యోగానికి ఎంపికైన విషయాన్ని అత్తింట్లో చెప్పగా దానికి వారు ఒప్పుకోలేదు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కళ్యాణికి నిరాశే ఎదురైంది.
అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగం విషయంలో అత్తగారి ఇంటి నుంచి వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. తన కన్న కలలను చేరులేకపోచున్నానని, తన భవిష్యత్తు ఇక్కడితో ముగిసిపోయిందని భావించి మానసిక ఒత్తిడికి గురైంది. మరోవైపు అత్తారింటి వేధింపులు భరించలేక శనివారం ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ప్రభుత్వం ఉద్యోగం చేయలనుకోవడమే నా కూతురు చేసిన పాపమా అంటూ నిలదీస్తున్నారు. కళ్యాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..