వికారాబాద్‌‌లో వింత జంతువు జననం.. పుట్టిన వెంటనే!

| Edited By:

Apr 29, 2020 | 9:28 AM

వికారాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వింత జంతువు జన్మించింది. అయితే అది పుట్టిన కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటన కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొర్ర శివబాలు నాయక్ అనే రైతుకు చెందిన ఆవు..

వికారాబాద్‌‌లో వింత జంతువు జననం.. పుట్టిన వెంటనే!
Follow us on

వికారాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వింత జంతువు జన్మించింది. అయితే అది పుట్టిన కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటన కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొర్ర శివబాలు నాయక్ అనే రైతుకు చెందిన ఆవు.. వింత ఆకారంలో ఉన్న జంతువుకు జన్మనిచ్చింది. ఆ జంతువు నుదుట ఒకటే కన్ను, రెండు పెద్ద పెద్ద దంతాలు, పెద్ద నాలుక, మనిషి చర్మంతో వింత రంగుతో ఉంది. ఇలా వింత ఆకారంలో పుట్టిన ఆ జంతువును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పుట్టిన గంట సేపటికే అది చనిపోయింది. కాగా గ్రామ శివారులో దాన్ని పూడ్చి పెట్టారు గ్రామస్తులు.

Read More: 

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

భారత్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు