మెదక్‌లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ డెడ్

| Edited By: Velpula Bharath Rao

Nov 03, 2024 | 1:59 PM

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో నాలుగు మృతిచెందారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు చనిపోవడం అందర్నీ కలిచివేసింది.

మెదక్‌లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ డెడ్
Road Accident
Follow us on

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం నుండి వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు ఒక పక్కన ధాన్యం ఆరబోయడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగి నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులు అదే గ్రామానికి చెందిన మన్నే ఆంజనేయులు, ఆయన తమ్ముని భార్య లావణ్య, కూతురు సహస్ర, స్వాతిగా గుర్తించారు. రోడ్డుపై విచక్షణారహితంగా పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు విలపించారు. ఢీ కొట్టిన ట్రాక్టర్ ఆపకుండా వెళ్లిపోవడంతో..పోస్ట్ మార్టం చేయకుండా మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాలను తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి