Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌లో అదిరిపోయే అప్‌డేట్‌..

|

Jul 19, 2022 | 6:35 AM

Whatsapp: యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను జోడిస్తోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఇతర మెసేజింగ్ యాప్‌ల నుంచి తీవ్రమైన పోటీని సైతం ఎదుర్కోవడానికి...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌లో అదిరిపోయే అప్‌డేట్‌..
Follow us on

Whatsapp: యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను జోడిస్తోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఇతర మెసేజింగ్ యాప్‌ల నుంచి తీవ్రమైన పోటీని సైతం ఎదుర్కోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే డిలీట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌, బల్క్‌ మెసేజ్‌ డిలీట్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త అప్‌డేట్‌తో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడింది. అవతలి వ్యక్తి చేసిన మెసేజ్‌లకు ఇన్‌స్టాంట్‌గా ఎమోజీల రూపంలో ఇచ్చే రియాక్షన్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్‌లో కేవలం ఆరు ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలోనే వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలు ఇందులో యాడ్‌ కానున్నాయని వాట్సాప్‌ తెలిపింది. అయితే దీంతో పాటు మరో అప్‌డేట్‌ను కూడా వాట్సాప్‌ తీసుకొస్తోంది. సాధారణంగా మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌తో కేవలం సదరు మెసేజ్‌ను చూస్తే కానీ అవతలి వ్యక్తి రియాక్షన్‌ సెండ్‌ చేసినట్లు తెలియదు.

అయితే కొత్తగా తీసుకొచ్చే అప్‌డేట్‌తో.. చాట్‌ పేజీ, గ్రూప్స్‌లో ఏయే మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇచ్చారో వాటి జాబితా చాట్‌ పేజీ పై భాగంలో కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..