WhatsApp New Feature: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఫేస్‌బుక్‌ ఫీచర్.. ఎప్పుడంటే?

|

Feb 15, 2022 | 8:50 AM

మీరు వాట్సాప్ ఉపయోగిస్తుంటే మీకో శుభవార్త త్వరలో మీ ముందుకు రానుంది. Facebook వంటి ఫీచర్‌ను వాట్సప్‌లో రాబోతోంది.

WhatsApp New Feature: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఫేస్‌బుక్‌ ఫీచర్.. ఎప్పుడంటే?
Whatsapp
Follow us on

WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో ఫీచర్లను యాడ్ చేస్తోంది. మెటా ప్రధాన ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ వినియోగదారులను కనెక్ట్ చేయడానికి అనేక సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. Facebookలో Instagram కంటెంట్, Instagramలో Facebook కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి కంపెనీ పని చేస్తూనే ఉంది. అయితే మెటా కంపెనీ ప్రస్తుతం దాని మూడవ, అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సప్ (WhatsApp)ని Facebook మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రెడీ అయింది. నివేదిక ప్రకారం, కంపెనీ ఫేస్‌బుక్ మాదిరిగానే ఒక ఫీచర్‌పై పని చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఫీచర్ ఏంటంటే?..

నివేదిక ప్రకారం, మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ప్రస్తుతం వాట్సాప్‌లో ప్రొఫైల్‌లో కవర్ ఫోటోను కూడా ఉంచే ఎంపికను ఇవ్వనుంది. ఈ ఫీచర్‌పై పని వేగంగా జరుగుతోంది. ఒక బృందం దీనిని పరీక్షిస్తోంది. ఫేస్‌బుక్‌లో మీరు మీ ప్రొఫైల్ ఫోటోతో పాటు కవర్ ఫోటోను కూడా ఉంచవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ప్రొఫైల్ ఫోటో పెట్టే ఆప్షన్ మాత్రమే ఉంది.

ఎవరికి ముందుగా ఈ ఆఫ్షన్ లభిస్తోందంటే?

నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ మొదట WhatsApp బిజినెస్ ఖాతా కోసం విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు మాత్రమే ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకోగలరు. అయితే, బిజినెస్ ఖాతా కోసం జారీ చేసిన ఈ ఫీచర్.. కొన్ని రోజుల తర్వాత వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Infinix Zero 5g: భారత మార్కెట్లోకి ఇన్‌ఫిక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. రూ. 20వేలలో అదిరిపోయే ఫీచర్లు..

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యతో ఇబ్బంది పడతున్నారా..? ఇలా చేయండి..!