ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. వ్యక్తిగత సమాచారంతో పాటు, మనకు సంబంధించిన సమస్తం మన స్మార్ట్ ఫోన్లలోనే నిక్షిప్తమవుతోంది. మనం వాడే యాప్స్, వాటి పాస్ వర్డ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇలా సమస్తం స్మార్ట్ ఫోన్లోనే ఉంటాయి. అటువంటి ఫోన్ హ్యాక్ అయినా, చోరీకి గురైనా.. మన భద్రతకు భంగం వాటిల్లుతుంది. అలాగే కొన్ని అసాంఘిక శక్తులు మన ఫోన్లను మనకు తెలియకుండానే హ్యాక్ చేసేసి వాటి ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్ ను భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానిలోని సమాచారం ఎవరికీ చేరకుండా కాపాడుకోవడం ముఖ్యం. అందుకే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎన్సీఐబీ) మీ స్మార్ట్ ఫోన్ ను రక్షించడానికి కొన్ని కోడ్లను అందిస్తోంది. వాస్తవానికి నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక స్వతంత్ర నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ). ఈ సంస్థ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో మీ ఫోన్లన భద్రంగా ఏడు సీక్రెట్ కోడ్లను షేర్ చేసింది. దానిలో ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు కూడా ఈ కోడ్ ల గురించి తెలుసుకోవాలని కోట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
स्मार्टफोन यूजर्स को फोन के सीक्रेट कोड्स की जानकारी होनी चाहिए। वैसे तो स्मार्टफोन के सीक्रेट कोड्स की लिस्ट काफी लंबी है लेकिन आपको कुछ महत्वपूर्ण कोड्स हैं जिन्हें आपका जानना बहुत जररूी है।
ఇవి కూడా చదవండి01- *#21#: इस सीक्रेट कोड्स की मदद से आप यह जान सकते हैं कि आपकी कॉल, डेटा या फिर…
— NCIB Headquarters (@NCIBHQ) November 5, 2023
అయితే ఈ కోడ్లు వినియోగించిన ప్రజలు వీటిల్లో చాలా తక్కువ సీక్రెట్ కోడ్లు మాత్రమ పని చేస్తున్నాయని, మిగిలిన కోడ్లు ఎర్రర్ వస్తున్నాయని ఎన్సీఐబీ ట్విట్ కింద కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిని షేర్ చేస్తున్నారు. కొన్ని కోడ్లు మాత్రమే పనిచేస్తున్నాయని ఓ వినియోగదారుడు కామెంట్ చేస్తే.. ఐఎంఈఐ తప్ప మరేఇతర కోడ్ కూడా పనిచేయడం లేదని మరొకరు రాశారు. 2, 5, 6 కోడ్లలో ఏ లోపం లేదని.. మిగిలినవి పని చేయడం లేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా వినియోగదారులు ఎన్సీబీఐ పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..