స్మార్ట్ ఫోన్‌లు పేలడం తరచూ వినే ఉంటాం. ఇటీవల ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదరువుతున్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌లు పేలే ఉదాంతాలు ఎక్కువుతున్నాయి. అందుకే ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్స్ పేలడానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* ఛార్జింగ్ చేస్తున్న సమయంలో ఫోన్‌లు పేలిపోవడానికి ప్రధాన కారణాల్లో ఓవర్ ఛార్జింగ్ ఒకటి. సాధారణంగా బ్యాటరీ నిండిన తర్వాత సర్క్యూట్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. అయితే ఒకవేళ సర్క్యూట్‌లో ఏవైనా సమస్యలు తలెత్తినా, సర్క్యూట్ సరిగ్గా పనిచేయకపోయినా బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అవుతుంటుంది. ఈ కారణంగా బ్యాటరీ ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇది చివరికి బ్యాటరీ పేలడానికి కారణమవుతుంది.
* బ్యాటరీ పేలడానికి ఫోన్‌లో ఉండే బ్యాటరీ నాణ్త కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని మీకు తెలుసా. తక్కువ నాణ్యత లేదా నకిలీ బ్యాటరీలు ఉండే ఫోన్‌లు పేలే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీ తయారీలో పేలవమైన పదార్థాలను ఉపయోగడం వల్ల బ్యాటరీ వేగంగా వేడెక్కి చివరికి పేలిపోతుంది.
* ఇక ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో మీరు ఫోన్ ఎక్కడ పెడుతున్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్ఆనరు. ముఖ్యంగా ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఫ్రిజ్, టీవీ వంటి వాటిపైస పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా వేడెక్కుతుంది. దీంతో ఇది బ్యాటరీ పేలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గాలి చొరబడి ప్రదేశాలు, దుప్పటిపై ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ వేడెక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు.
* నాణ్యత తేలిన ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల కూడా ఫోన్‌లు పేలిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నాణ్యత లేని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల ఫోన్‌కు ఒకేసారి ఎక్కువ వోల్టేజీ సరఫరా అవుతుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కే అవకాశం ఉంటుంది. ఇది ఫోన్ పేలడానికి కారణమవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..