మెదడులో రక్తప్రసరణ గురించి కూడా చెప్పేసే స్మార్ట్‌వాచ్! టెంపుల్ ఎలా పని చేస్తుంది?

Temple Wearable.. జొమాటో మాజీ బాస్ దీపిందర్ గోయల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఫుడ్ డెలివరీ రంగంతో కాదు.. హెల్త్ టెక్నాలజీతో సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. Temple పేరుతో తీసుకొచ్చిన కొత్త వేరబుల్ సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా మెదడులో రక్త ప్రసరణను గుర్తించే సామర్థ్యం దీనికి ఉందని కంపెనీ పేర్కొంటోంది.

మెదడులో రక్తప్రసరణ గురించి కూడా చెప్పేసే స్మార్ట్‌వాచ్! టెంపుల్ ఎలా పని చేస్తుంది?
Temple Wearable By Deepinder Goyal

Updated on: Sep 13, 2026 | 8:30 PM

స్మార్ట్‌వాచ్ పెట్టుకుంటే హార్ట్ రేట్, స్టెప్స్, నిద్ర వంటి వివరాలు తెలుసుకోవచ్చు. కానీ మెదడులో రక్త ప్రసరణ ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే ఇప్పటివరకు ప్రత్యేక వైద్య పరికరాలు అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే లక్ష్యంతో Temple అనే చిన్న వేరబుల్ ముందుకొచ్చింది. దీపిందర్ గోయల్ చెబుతున్న ఈ టెక్నాలజీపై తాజాగా ఆసక్తికరమైన పరిశోధన జరిగింది.

కణతకు అతుక్కునే చిన్న డివైస్..

ఇప్పటివరకు మనం చూసిన స్మార్ట్‌వాచ్‌లు మణికట్టుకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే Temple Wearable మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ పరికరాన్ని నుదుటి పక్క భాగంలో లేదా కణత వద్ద అమర్చుకునేలా రూపొందించారు. హార్ట్ రేట్‌ను ట్రాక్ చేయడంతో పాటు బ్రెయిన్ బ్లడ్ ఫ్లోలో వచ్చే మార్పులను కూడా అంచనా వేయగలదని కంపెనీ చెబుతోంది. సైక్లింగ్ చేస్తున్నప్పుడు, అలాగే పడుకున్న సమయంలో మెదడులో రక్త ప్రసరణలో చోటుచేసుకునే మార్పులను గుర్తించే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధనలో వెల్లడైంది. దీంతో సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నమైన ఆరోగ్య సమాచారాన్ని అందించే అవకాశం కనిపిస్తోంది.

23 మందిపై టెస్ట్..

Temple పనితీరును అంచనా వేసేందుకు 23 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై వాలిడేషన్ స్టడీ నిర్వహించారు. మెదడు రక్త ప్రసరణను కొలిచేందుకు ఉపయోగించే స్టాండర్డ్ పద్ధతి ‘ట్రాన్స్‌క్రానియల్ డోప్లర్’ (TCD)తో ఈ డివైస్ రీడింగ్స్‌ను పోల్చారు. సైక్లింగ్ సమయంలో హార్ట్ రేట్ పెరగడంతో పాటు బ్రెయిన్ బ్లడ్ ఫ్లో కూడా పెరిగినట్లు గుర్తించారు. Temple కూడా ఇదే ట్రెండ్‌ను గుర్తించింది. అలాగే నిలబడిన స్థితి నుంచి పడుకున్నప్పుడు హార్ట్ రేట్ తగ్గినా, మెదడులో రక్త ప్రసరణ పెరిగినట్లు డివైస్ చూపించింది. ఎక్సర్‌సైజ్ సమయంలో హార్ట్ రేట్‌ను 4% లోపు తేడాతో ట్రాక్ చేసినట్లు పరిశోధనలో పేర్కొన్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. Temple ఇంకా పూర్తిస్థాయి వైద్య పరికరంగా నిర్ధారించబడలేదు. పరిశోధన ప్రస్తుతం పీర్ రివ్యూ దశలో ఉంది. ఇది నేరుగా బ్రెయిన్ బ్లడ్ ఫ్లోనే కొలుస్తుందా, చుట్టుపక్కల కణజాలం ఆధారంగా అంచనా వేస్తుందా అనే అంశంపై మరింత పరిశోధన అవసరం. భవిష్యత్తులో క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో ఇది ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us