Tecno Pop 6 Pro: రూ. 6 వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..

|

Sep 30, 2022 | 11:20 AM

టెక్నో పాప్‌ 6 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలపై ఓ లక్కేయండి..

Tecno Pop 6 Pro: రూ. 6 వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..
Tecno Pop 6 Pro
Follow us on

పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే లక్ష్యంగా కంపెనీలు కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కంపెనీలకు తోడుగా ఈ కామర్స్‌ సైట్స్‌ సైతం భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లో బడ్జెట్‌లో హై ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. టెక్నో పాప్‌ 6 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలపై ఓ లక్కేయండి..

టెక్నో పాప్‌ 6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్‌ను 720×1612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో ఆక్టా కోర్‌ చిప్‌సెట్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో రూపొందించిన ఈ ఫోన్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 42 రోజుల స్టాండ్‌బై అందిస్తుంది.

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7999కి తీసుకొచ్చారు. అయితే అమేజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 6,099కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఫోన్‌ను పీస్‌ఫుల్ బ్లూ, పవర్ బ్లాక్ స్మార్ట్‌ఫోన్ అనే కలర్స్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో మైక్రో కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..