Realme Smartwatch: రియల్‌మీ నుంచి స్మార్ట్‌వాచ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే!

|

Mar 11, 2022 | 7:18 PM

Realme Smartwatch: టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక రియల్‌మీ నుంచి స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా స్మార్ట్‌వాచ్‌లు..

Realme Smartwatch: రియల్‌మీ నుంచి స్మార్ట్‌వాచ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే!
Follow us on

Realme Smartwatch: టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక రియల్‌మీ నుంచి స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా స్మార్ట్‌వాచ్‌లు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. రియల్‌మీ టెక్‌లైఫ్‌ వాచ్‌ ఎస్‌ 100 (Realme TechLife Watch S100) పేరుతో ఈ స్మార్ట్‌వాచ్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. బాడీలో వేడిని కొలిచే బాడీ టెంపరేచర్‌ సెన్సార్‌ ఉండటం ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకత. స్క్వేర్ డయల్, రౌండెడ్ ఎడ్జ్‌ డిజైన్ కలిగి ఉంది. ఇక హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, SpO2 లాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 24 స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.2,499 ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ.1,999కే అందుబాటులో ఉంది. బ్లాక్‌, గ్రే కలర్‌లలో ఈ స్మార్ట్‌ వాచ్‌ లభిస్తోంది. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లలో సేల్‌ మొదలు కానుంది.

రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్స్‌:

ఇక ఈ రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్స్‌ను పరిశీలిస్తే.. 1.69 అంగుళాల కలర్‌ టచ్‌ డిస్‌ప్లే, 530 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌(SpO2) ట్రాకర్‌, స్లీప్‌ క్వాలిటీ మానిటర్‌, స్కిన్‌ అండ్‌ బాడీ టెంపరేచర్‌ మానిటర్‌ లాంటి హెల్త్‌ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. అలాగే బాడీ టెంపరేచర్‌ ఫీచర్‌ ఉన్నా.. ఇది మెడికల్‌ థర్మామీటర్‌కు ప్రత్యామ్నాయం కాదని రియల్‌మీ వెల్లడించింది. ఇదొక హెల్త్‌ ఫీచర్‌ అని తెలిపింది. ఇక స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తుంది. అలాగే ఫోన్‌ కనెక్ట్ అయినప్పుడు మ్యూజిక్ కంట్రోల్, కెమెరా యాక్సెస్, ఫైండ్ మై ఫోన్‌ లాంటి ఫీచర్లను వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ఈ వాచ్‌కు 110 వాచ్‌ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. రన్నింగ్, డ్యాన్సింగ్, వాకింగ్ సహా మొత్తంగా 24 స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్‌లో ఉన్నాయి. ఈ వాచ్‌ 260ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే సుమారు 12 రోజుల పాటు వస్తుందని రియల్‌మీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Whatsapp: వాట్సాప్‌ ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా చెక్‌ చేయాలి..? సులభమైన మార్గాలు

Whatsapp: మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌తో రానున్న వాట్సాప్‌.. ఇకపై గ్రూప్స్‌లో ఆ అవకాశం..