
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చిన్ననాటి అల్లర్లు, చిరు గొడవలు, స్నాక్స్ కోసం కొట్లాటలు, ఒకరికొకరు చెప్పుకునే రహస్యాలు.. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు తోబుట్టువుల మధ్యే ఉంటాయి. ఈ రక్షాబంధన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక అదిరే మార్గాన్ని అందిస్తుంది. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 (వంటి అత్యాధునిక ఏఐ టూల్స్ ద్వారా మీ పాత జ్ఞాపకాలను సినిమా పోస్టర్లుగా, కామిక్ స్ట్రిప్స్‌గా, సూపర్ హీరో అవతారాలుగా మార్చుకుని మీ తోబుట్టువులకు ప్రత్యేకమైన డిజిటల్ కానుకలను అందించవచ్చు.
రొటీన్‌గా బెస్ట్ బ్రదర్, బెస్ట్ సిస్టర్ కాకుండా.. ఫ్యామిలీ సీక్రెట్ కీపర్, ఫుడ్ చోర్ వంటి ఫన్నీ టైటిల్స్‌తో పండుగ వాతావరణం, మిఠాయిలు, రాఖీ థీమ్‌తో కూడిన ప్రీమియం అవార్డు పోస్టర్‌ను మీ ఫొటోలతో తయారు చేయవచ్చు.
మీ తోబుట్టువుల మధ్య ఉండే అలకలు, ఆటపట్టించడాలు, ప్రేమానురాగాలను బేస్ చేసుకుని ఒక సినిమా తరహా పోస్టర్‌గా మార్చవచ్చు. ముఖ కవళికలు సహజంగా ఉండేలా చూస్తూ డ్రామా, కామెడీ కలగలిపిన ఫీల్ తీసుకురావచ్చు.
మీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఉపయోగించి, మీ వ్యక్తిత్వాలకు తగిన సూపర్ హీరో పాత్రల్లో సరికొత్త కాస్ట్యూమ్స్, రాఖీ థీమ్‌తో శక్తిమంతమైన సూపర్ హీరో టీమ్‌గా రీ-ఇమాజిన్ చేసుకోవచ్చు.
టీవీ రిమోట్ కోసం లేదా చిరుతిళ్ల కోసం మీరు నిత్యం పడే గొడవలను 4-ప్యానెల్ కామిక్ స్ట్రిప్‌గా మార్చవచ్చు. చిన్ననాటి గొడవతో మొదలై చివర్లో రాఖీ పండుగతో ఒక్కటయ్యేలా దీన్ని క్రియేట్ చేయవచ్చు.
వేర్వేరు నగరాల్లో లేదా దేశాల్లో ఉంటున్న తోబుట్టువులను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తూ.. రెండు నగరాల ల్యాండ్‌మార్క్‌లను కలుపుతూ మధ్యలో రాఖీ దారం వెళ్లేలా అందమైన స్ప్లిట్ సీన్ పోస్ట్‌కార్డ్‌ను డిజైన్ చేయవచ్చు.
నాలుగు దశాబ్దాల తర్వాత మీరిద్దరూ వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఊహిస్తూ, సాంప్రదాయ రాఖీ తాంబూలం, పాత జ్ఞాపకాల ఫొటోలతో భావోద్వేగభరితమైన ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని రూపొందించవచ్చు.
కేవలం మాటల్లో చెప్పలేని తోబుట్టువుల ప్రేమానురాగాలను, గిల్లికజ్జాలను ఇలాంటి సరికొత్త ఏఐ సాంకేతికతతో దృశ్య రూపంలోకి మార్చి ఈ రక్షాబంధన్‌ను మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చుకోవచ్చు.