NSA warning: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్.. ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే..!

|

Apr 02, 2025 | 4:30 PM

ఆధునిక కాలంలో ఫోన్ అత్యంత అవసరమైన వస్తువుగా మారింది. పెరిగిన టెక్నాలజీ సాయంతో ఫోన్ ద్వారా అనేక పనులను చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. ఆర్థిక లావాదేవీలు మొదలుకుని, షాపింగ్ చేయడం, సినిమా టిక్కెట్లు బుక్ చేయడం, వస్తువులను కొనడం.. ఇలా అన్ని పనులు ఇంటిలో కూర్చుని చేసుకునే వీలు కలిగింది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు.

NSA warning: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్.. ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే..!
Nsa Warning
Follow us on

సాధారణంగా ఫోన్ లోనే మన వ్యక్తిగత సమాచారం అంటే బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు ఉంటాయి. సైబర్ నేరగాళ్ల వాటిని తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ఇటీవల ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ఫోన్లలో సెట్టింగ్ లను మార్చుకోవాలని ఆదేశించింది. సిగ్నల్ యాప్ గ్రూపు లింక్ ల వల్ల కలిగే ప్రమాదాలపై జాతీయ భద్రతా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి లింక్ ల ద్వారా సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ప్రజలకు సూచించింది. ముఖ్యంగా ఆ యాప్ లో ప్రమాదకరమైన రెండు రకాల లక్షణాలను నివేదించింది. లింక్డ్ డివైజెస్, గ్రూప్ ఇన్వైట్ లింక్ లతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. యూజర్లు తమ వ్యక్తిగత వివరాల భద్రను కాపాడుకోవడానికి వాటిలోని సెట్టింగ్ లను మార్చుకోవాలని కోరింది.

లింక్డ్ డివైజెస్ ఫీచర్ వల్ల యూజర్లు అనేక పరికరాల్లోని తమ మెసేజ్ లను పంపుకోవచ్చు. దీని వల్ల ఇతరులతో కమ్యూనికేషన్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఈ ఫీచర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. కానీ హ్యాకింగ్ కు గురైతే మీ ఖాతా వివరాలు దొంగిలించబడతాయి. అది మీ వ్యక్తిగత భద్రతకు నష్టం కలిగించవచ్చు. ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తమ యాప్ సెట్టింగ్ లలో తెలియని పరికరాలను అన్ లింక్ చేసుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా ఫోన్ ను పరిశీలించాలి. గ్రూపులోకి కొత్త సభ్యులను ఆహ్వానించడానికి గ్రూప్ ఇన్వైట్ లింక్ లు ఉపయోగపడతాయి. ఇదే సమయంలో మీ భద్రతకు ప్రమాదం కలిగిస్తాయి. మీకు సంబంధించిన కీలక సంభాషణలను బహిర్గతం చేస్తాయి. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో అధికారులు యుద్ద ప్రణాళికలను పంచుకోవడానికి మెసేజింగ్ యాప్ సిగ్నల్ ను ఉపయోగించారు. అదే సమయంలో అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ – చీఫ్ జెఫ్రీ గోల్డ్ బర్డ్ ను ఆ గ్రూప్ చాట్ లో పొరపాటున చేర్చారు. యొమెన్ లో ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటు దారులపై దాడులకు ట్రంప్ ఆదేశించారు. ఆ విషయాలు అట్లాంటిక్ ఎడిటర్ కు తెలిసిపోయాయి.

ఇవి కూడా చదవండి

డైరెక్ట్ మెసేజింగ్, గ్రూప్ చాట్లు, ఫోన్లు, వీడియో కాల్స్ కోసం సిగ్నిల్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఇది సంప్రదాయ టెక్స్టింగ్ కంటే సురక్షితంగా ఉన్నప్పటికీ హ్యాంకింగ్ కు గురయ్యే అవకాశం లేకపోలేదు. రష్యన్ లింక్డ్ గూఢచారులు సిగ్నల్ కాంటాక్టులుగా నటిస్తూ ఉక్రెయిన్ సైనిక అధికారుల సిగ్నల్ ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని గూగుల్ కు చెందిన భద్రతా సంస్థ మాండియంట్ వెల్లడించింది.