Motorola Edge 70 Neo 5G: భారీ బ్యాటరీ, కొనేయాలనిపించే ఫీచర్లతో వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మోటరోలా నుంచి మరో ఆసక్తికరమైన మోడల్‌ రాబోతోంది. ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా Motorola Edge 70 Neo 5Gను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ కనిపించడంతో లాంచ్‌పై అంచనాలు పెరిగాయి. లీకైన సమాచారం ప్రకారం నవంబర్ 26, 2026న ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఇప్పటివరకు లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

Motorola Edge 70 Neo 5G: భారీ బ్యాటరీ, కొనేయాలనిపించే ఫీచర్లతో వచ్చేసింది
Motorola Edge 70 Neo 5g

Updated on: Nov 18, 2026 | 7:10 AM

మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని Motorola Edge 70 Neo 5G ఫోన్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లే, Snapdragon ప్రాసెసర్‌, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ విభాగాల్లో మంచి స్పెసిఫికేషన్లు అందిస్తే ఈ ధరలో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Snapdragon ప్రాసెసర్‌

Motorola Edge 70 Neo 5Gలో 6.78 అంగుళాల క్వాడ్‌ కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఇది 1.5K రిజల్యూషన్‌, 144Hz రిఫ్రెష్ రేట్‌, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేయనుంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass 7i రక్షణ కూడా ఉండనుంది. ప్రాసెసర్‌ విషయానికి వస్తే Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 4nm టెక్నాలజీతో రూపొందిన ఈ చిప్‌సెట్‌కు జతగా 6GB లేదా 8GB LPDDR5X RAM, 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉండొచ్చని అంచనా.

7000mAh బ్యాటరీ..

ఈ ఫోన్‌లో 7000mAh సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉండనుంది. కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌ ఉండనున్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 32MP కెమెరా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ ధరలో Redmi, Realme, OnePlus, Samsung బ్రాండ్ల ఫోన్లతో Motorola Edge 70 Neo 5G పోటీ పడే అవకాశం ఉంది. అయితే ధర, ఫీచర్లు, లాంచ్ తేదీపై కంపెనీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us