అదిరే ఫీచర్లతో Maruti Brezza Turbo.. వినియోగదారులకు ఆసక్తి పెంచేస్తున్న రివ్యూ.. అంతగా ఏముంది

కాంపాక్ట్ SUV కొనాలని భావించే వారికి Maruti Suzuki Brezza మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. మంచి ధర, సౌకర్యవంతమైన ప్రయాణం, రోజువారీ అవసరాలకు సరిపోయే ఫీచర్లతో ఈ SUV మార్కెట్లో గుర్తింపు పొందింది. ఇప్పుడు Boosterjet Turbo ఇంజిన్, కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన Brezza Turbo పనితీరుపై ఆసక్తి పెరిగింది. ఈ కారును సుమారు 1,200 కిలోమీటర్లు నడిపి లాంగ్ టర్మ్ టెస్ట్ నిర్వహించగా, ఇంజిన్ పనితీరు నుంచి డ్రైవింగ్ సౌకర్యం వరకు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

అదిరే ఫీచర్లతో Maruti Brezza Turbo.. వినియోగదారులకు ఆసక్తి పెంచేస్తున్న రివ్యూ.. అంతగా ఏముంది
Maruti Suzuki Brezza Turbo Zxi+

Updated on: Nov 18, 2026 | 6:40 AM

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఫీచర్లు, లుక్స్ మాత్రమే కాకుండా రోజువారీ ప్రయాణంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్, గేర్‌బాక్స్ పనితీరు, మైలేజీ, రోడ్లపై డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ లాంగ్ టర్మ్ టెస్ట్‌లో Brezza Turbo కొన్ని విషయాల్లో ఆకట్టుకోగా, మరికొన్ని అంశాల్లో నిరాశపరిచింది. ఈ SUVలోని ప్లస్‌లు, మైనస్‌లు ఏమిటో చూద్దాం.

గేర్‌బాక్స్ పనితీరు

Brezzaలోని Boosterjet Turbo ఇంజిన్ సిటీ ట్రాఫిక్‌లోనూ స్మూత్‌గా పనిచేస్తుంది. 2,000 rpm దగ్గర గరిష్ట టార్క్ అందుబాటులోకి రావడంతో కారు వేగంగా స్పందిస్తుంది. తక్కువ గేర్ రేషియో కారణంగా డ్రైవింగ్ సులభంగా ఉంటుంది. అయితే 1,500 rpm కంటే తక్కువ వేగం వద్ద కొద్దిగా టర్బో లాగ్ కనిపిస్తుంది. ఆ పరిధి దాటిన తర్వాత వేగం స్థిరంగా పెరుగుతుంది. ఇంజిన్ ప్రకంపనలు తక్కువగా ఉండటంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.

6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, లైట్ క్లచ్ సిటీ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి. గేర్లు సాఫీగా మారడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు తగ్గుతాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, సూపర్ ఆడియో సిస్టమ్, పెద్ద స్క్రీన్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వంటి ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి. ఫోన్ కనెక్టివిటీ, Apple CarPlay వినియోగం సులభంగా ఉండటంతో పాటు కెమెరాల నాణ్యత కూడా బాగుంది.

మైనస్ పాయింట్లు

డిజైన్ విషయంలో ఈ SUV అంతగా ఆకట్టుకోలేదని టెస్ట్‌లో అభిప్రాయం వ్యక్తమైంది. రెడ్ కలర్ హైలైట్స్, టర్బో స్టిక్కర్ కొంత అతిగా అనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్ కూడా పాత తరహాలో కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్ల కారణంగా కెమెరాలు పదేపదే ఆన్ కావడం ఇబ్బందిగా మారుతుంది. పాత Brezzaతో పోలిస్తే మలుపుల్లో డ్రైవింగ్ ఫన్, యాక్టివ్‌నెస్ తగ్గినట్లు అనిపించింది. వెంటిలేటెడ్ సీట్లు, కొన్ని ADAS ఫీచర్లు ఉన్నప్పటికీ మరింత కొత్తదనం ఆశించే వారికి నిరాశ కలగవచ్చు.

ముఖ్యంగా స్పేర్ టైర్ లేకపోవడం పెద్ద మైనస్‌గా నిలిచింది. గుంతలు, దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించేవారికి పంక్చర్ రిపేర్ కిట్ మాత్రమే సరిపోకపోవచ్చు. అందుకే అదనంగా స్పేర్ టైర్ కొనుగోలు చేసుకోవడం మంచిదని టెస్ట్ డ్రైవర్ సూచించారు.

ఈ లాంగ్ టర్మ్ టెస్ట్‌లో ఉపయోగించినది Maruti Brezza Turbo ZXi+ మోడల్. 1,200 కిలోమీటర్ల ప్రయాణంలో లీటర్‌కు 12.1 కి.మీ. మైలేజీ నమోదైంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.25 లక్షలు. ఇంజిన్, గేర్‌బాక్స్, సౌకర్యవంతమైన ఫీచర్లు ప్లస్ పాయింట్లుగా నిలిచినా.. డిజైన్, డ్రైవింగ్ అనుభూతి, స్పేర్ టైర్ విషయంలో మెరుగుదల అవసరమని ఈ రివ్యూ సూచిస్తోంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us