ఒక్కరోజులో 1,80,000 ఫోన్లు సేల్‌ చేసిన హువాయ్! ఫీచర్లు చూస్తే షాకవ్వక తప్పదు మరి

Huawei Pura X.. స్మార్ట్‌ఫోన్ అంటే సాధారణంగా పొడవైన ఆకారమే గుర్తొస్తుంది. కానీ Huawei మాత్రం దీనికి భిన్నంగా పాస్‌పోర్ట్‌ను పోలిన డిజైన్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. Huawei Pura X View పేరుతో వచ్చిన ఈ డివైజ్ ప్రపంచంలోనే తొలి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. చైనాలో విడుదలైన తొలిరోజే 1,80,000కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఒక్కరోజులో 1,80,000 ఫోన్లు సేల్‌ చేసిన హువాయ్! ఫీచర్లు చూస్తే షాకవ్వక తప్పదు మరి
Huawei Pura X View

Updated on: Sep 16, 2026 | 6:40 AM

భిన్నమైన డిజైన్‌తో పాటు భారీ కెమెరా, పెద్ద బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో Huawei Pura X View స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబర్ 7న చైనాలో విడుదలైన ఈ ఫోన్‌కు మొదటి రోజే భారీ స్పందన వచ్చింది. 12GB RAMతో పాటు 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండటం కూడా దీని ప్రత్యేకతగా మారింది.

పాస్‌పోర్ట్ డిజైన్.. 120Hz OLED స్క్రీన్

Huawei Pura X Viewలో Kirin 9030S ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వేడెక్కకుండా 6,400mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. ముందు భాగంలో 6.39 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 16:9.5 ఆస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, Kunlun Glass రక్షణ లభిస్తుంది. మెమరీ విషయానికి వస్తే 12GB RAMతో 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచడంతో అమ్మకాలకు మరింత ఊపు వచ్చినట్లు సమాచారం.

200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ

కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 200MP ప్రధాన కెమెరా, 50MP పెరిస్కోప్ టెలీఫోటో, 8MP అల్ట్రా-వైడ్, Red Maple కలర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 40MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 7,000mAh. ఇది 66W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ మందం 6.68 mm, బరువు సుమారు 201 గ్రాములు మాత్రమే. HarmonyOS 7పై పనిచేసే ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. Two-way BeiDou satellite messaging, eSIM సపోర్ట్ కూడా అందించారు. Shadow Red, Linen Gray, Zero White, Midnight Black రంగుల్లో ఇది లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us