ఫస్ట్‌ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న Huawei.. డిస్‌ప్లే, RAM సహా ఎన్నో స్పెషాలిటీస్​తో Mate X8

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న Huawei మరో కొత్త ఫోన్‌తో టెక్ మార్కెట్‌లో ఆసక్తి పెంచుతోంది. తన Mate X సిరీస్ 8వ వార్షికోత్సవం సందర్భంగా Huawei Mate X8 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. తాజాగా విడుదలైన వీడియోలో ఫోన్ డిజైన్‌ను చూపించింది. దీంతో ఈ కొత్త మోడల్‌పై టెక్ ప్రియుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఫోన్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఫస్ట్‌ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న Huawei.. డిస్‌ప్లే, RAM సహా ఎన్నో స్పెషాలిటీస్​తో Mate X8
Huawei Mate X8 Foldable Smartphone

Updated on: Nov 18, 2026 | 6:10 AM

ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి Huawei Mate X8 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. డిజైన్‌తో పాటు పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు ప్రత్యేకంగా Collectors Edition కూడా అందుబాటులోకి రానుందని లీకులు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Huawei Mate X8 డిజైన్

కంపెనీ విడుదల చేసిన వీడియో ప్రకారం.. Huawei Mate X8 ఇన్‌వర్డ్ ఫోల్డింగ్ డిజైన్‌తో రానుంది. అంటే ఫోన్‌ను మడిచినప్పుడు ప్రధాన డిస్‌ప్లే లోపలికి వెళ్లి రక్షణగా ఉంటుంది. వెనుక భాగంలో పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ కనిపిస్తోంది. డిజైన్ పరంగా గతంలో వచ్చిన Mate X7ను పోలి ఉన్నప్పటికీ, కొత్త మోడల్ మరింత స్లిమ్ ఫినిషింగ్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. లీకుల ప్రకారం ఇందులో బయట 6.5 ఇంచుల డిస్‌ప్లే, లోపల 8.15 ఇంచుల భారీ స్క్రీన్ ఉండవచ్చు. లోపలి డిస్‌ప్లే రక్షణ కోసం Ultra-Thin Glass (UTG) టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.

Kirin 9050 Pro ప్రాసెసర్‌

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో Kirin 9050 Pro ప్రాసెసర్‌ను అందించనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఉండవచ్చని సమాచారం. ఇక Collectors Editionలో 16GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రంగుల విషయానికి వస్తే ఆరెంజ్, వైట్, బ్లాక్, గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో మొత్తం ఐదు వేరియంట్లు అందుబాటులోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ధర, లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లపై Huawei అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us