ఏఐ పవర్‌‌తో అదరగొట్టేస్తున్న హువాయి ఫ్రీబడ్స్‌ 7.. ఫీచర్లు తెలిస్తే ఫిదా కావాల్సిందే

Huawei FreeBuds 7.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో Huawei తన కొత్త FreeBuds 7తో ఆడియో ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం మ్యూజిక్, కాల్స్‌కే పరిమితం కాకుండా AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, స్మార్ట్ ట్రాన్స్‌లేషన్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. తేలికపాటి డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఏఐ పవర్‌‌తో అదరగొట్టేస్తున్న హువాయి ఫ్రీబడ్స్‌ 7.. ఫీచర్లు తెలిస్తే ఫిదా కావాల్సిందే
Huawei Freebuds 7

Updated on: Sep 12, 2026 | 6:40 AM

మ్యూజిక్ వినేటప్పుడు క్లియర్ సౌండ్, కాల్స్‌లో స్పష్టమైన వాయిస్, ఇతర భాషల్లో సంభాషణలకు సులభమైన అనువాదం.. ఇవన్నీ ఒకే గ్యాజెట్‌లో లభిస్తే ఎలా ఉంటుంది? హువావే ఫ్రీబడ్స్‌ 7లో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్నట్టు కంపెనీ సమాచారం చెబుతోంది. ముఖ్యంగా AI టెక్నాలజీతో పనిచేసే ఆడియో ఫీచర్లు ఈ ఇయర్‌బడ్స్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో క్లియర్ కాల్స్

హువావే ఫ్రీబడ్స్‌ 7లో మూడో జనరేషన్ ఆడియో AI చిప్‌ను ఉపయోగించినట్టు సమాచారం. కాల్స్ సమయంలో పరిసరాల్లోని శబ్దాన్ని గుర్తించి తగ్గించేందుకు ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను సెకనుకు 4 లక్షల సార్లు శాంపిల్ చేసి కేవలం 8 మైక్రోసెకన్లలో ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఇందులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంటోంది.

దీనికి అదనంగా మూడు మైక్రోఫోన్లు, VPU కాల్‌ నాయిస్‌ రిడక్షన్​ సిస్టమ్‌ను అందించారు. దీంతో ట్రాఫిక్, రద్దీ ప్రాంతాలు వంటి శబ్దంతో కూడిన ప్రదేశాల్లోనూ కాల్స్ సమయంలో వాయిస్ మరింత స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది. రోజువారీ కాలింగ్ అవసరాలు ఎక్కువగా ఉన్న వారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.

స్మార్ట్ ట్రాన్స్‌లేషన్..

హువావే ఫ్రీబడ్స్‌ 7లో మరో ఆసక్తికరమైన ఫీచర్ టూవే స్మార్ట్‌ ట్రాన్స్‌లేషన్. వేర్వేరు భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య సంభాషణను సులభతరం చేసేలా ఈ సదుపాయాన్ని రూపొందించారు. ప్రయాణాలు, అంతర్జాతీయ సంభాషణలు చేసే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.

డిజైన్ పరంగా ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.3 గ్రాములు మాత్రమే. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 42 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని సమాచారం. ప్రస్తుతం చైనా మార్కెట్లో హువావే ఫ్రీబడ్స్‌ 7 ధర సుమారు రూ.14,000గా ఉంది. భారత్‌లో లాంచ్ తేదీ, అధికారిక ధరపై హువావే నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us