మీ Google Account ఎవరి చేతుల్లో ఉంది? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి! లేదంటే మీ పని గోవిందా!

మీ Google Account భద్రతకు పాత పరికరాల నుండి సైన్ అవుట్ చేయడం ముఖ్యం. మీ Google ఖాతాలోకి వెళ్లి, 'Security' విభాగంలో 'Your devices'ని తనిఖీ చేయండి. తెలియని లేదా ఉపయోగించని పరికరాల నుండి వెంటనే సైన్ అవుట్ చేయండి. బలమైన పాస్‌వర్డ్‌తో పాటు 2-Step Verification ఎనేబుల్ చేసి, పాత ఫోన్ అమ్మే ముందు మీ ఖాతా నుండి పూర్తిగా లాగ్ అవుట్ అవ్వడం ద్వారా మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోవచ్చు.

మీ Google Account ఎవరి చేతుల్లో ఉంది? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి! లేదంటే మీ పని గోవిందా!
Google Account Security

Updated on: Aug 29, 2026 | 11:41 AM

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్.. ఏ పరికరం ఉపయోగించినా మన డిజిటల్ జీవితంలో Google Account కీలకంగా మారిపోయింది. Gmail, Google Drive, Google Photos, YouTube, Contacts, Calendar వంటి అనేక సేవలు ఒకే ఖాతాతో అనుసంధానమై ఉంటాయి. దీంతో మనం ఉపయోగించిన పాత ఫోన్ లేదా ఇతర పరికరాల్లో Google Account లాగిన్ అయి ఉండిపోయినా, అది భద్రతా సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత ఫోన్‌ను అమ్మేసినప్పుడు లేదా ఇతరులకు ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా చెక్ చేయాలి.

Google Account లాగిన్ ఎలా తెలుసుకోవాలి?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో Google Account ఓపెన్ చేయండి. అనంతరం “Manage your Google Account” ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే మెనూలో “Security” విభాగాన్ని ఎంచుకోండి. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేస్తే “Your devices” లేదా “Manage all devices” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ Google Account ప్రస్తుతం, ఇటీవల ఉపయోగించిన పరికరాల జాబితా కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుత ఫోన్‌తో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి పరికరాలు కూడా కనిపించవచ్చు.

డివైజ్ మీదేనా? వివరాలు ఇలా చెక్ చేయండి..!

జాబితాలో కనిపించిన పరికరం పేరును చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దానిపై క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు పరిశీలించవచ్చు. పరికరం పేరు, ఖాతా కార్యకలాపాలు, చివరిసారి ఉపయోగించిన సమయం వంటి సమాచారం కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. దీంతో అది మీరు ఉపయోగించిన పాత పరికరమా లేదా మీకు తెలియని పరికరమా అనే విషయాన్ని గుర్తించవచ్చు.

తెలియని Device కనిపిస్తే ఏం చేయాలి!

మీకు తెలియని ఫోన్, కంప్యూటర్ లేదా ఇతర పరికరం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ పరికరాన్ని ఓపెన్ చేసి “Sign out” ఆప్షన్‌ను ఎంచుకోండి. దీంతో ఆ పరికరం నుంచి మీ Google Account యాక్సెస్‌ను తొలగించవచ్చు. అంతేకాకుండా, ఎవరో మీ ఖాతాను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని అనుమానం ఉంటే వెంటనే Google Account Password మార్చడం మంచిది. కొత్త పాస్‌వర్డ్ బలంగా ఉండాలి. ఇతర ఖాతాలకు ఉపయోగించిన అదే పాస్‌వర్డ్‌ను Google Accountకు ఉపయోగించకపోవడం మరింత సురక్షితం.

Password ఒక్కటే సరిపోతుందా?

ఖాతా భద్రతను మరింత పెంచుకోవడానికి 2-Step Verificationను యాక్టివేట్ చేసుకోవడం మంచిది. ఇది లాగిన్ సమయంలో పాస్‌వర్డ్‌తో పాటు అదనపు ధృవీకరణను కోరుతుంది. కాబట్టి ఎవరికైనా మీ పాస్‌వర్డ్ తెలిసినా, రెండో దశ ధృవీకరణ లేకుండా ఖాతాలోకి ప్రవేశించడం కష్టమవుతుంది. అందువల్ల మీ Google Accountలోని Device Listను క్రమం తప్పకుండా పరిశీలించడం, పాత/తెలియని పరికరాల నుంచి Sign Out చేయడం, బలమైన Password ఉపయోగించడం, 2-Step Verificationను ఎనేబుల్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత డేటాకు అదనపు రక్షణ కల్పించుకోవచ్చు. ముఖ్యంగా పాత ఫోన్‌ను అమ్మే ముందు Google Accountతో పాటు ఇతర ముఖ్యమైన ఖాతాల నుంచి కూడా Sign Out చేయడం మర్చిపోవద్దు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us