క్రియేటర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన యూట్యూబ్.. ఆ వీడియోలకు డబ్బులే డబ్బులు.. రివార్డు ఎంతో తెలిస్తే షాకవుతారు..!

|

Aug 05, 2021 | 5:20 AM

తాజాగా షార్ట్స్ క్రియోటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. షార్ట్‌ వీడియోలు తీసే క్రియోటర్లకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది.

క్రియేటర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన యూట్యూబ్.. ఆ వీడియోలకు డబ్బులే డబ్బులు.. రివార్డు ఎంతో తెలిస్తే షాకవుతారు..!
Youtube Shorts
Follow us on

యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. వీడియోలలో రారాజుగా పేరుగాంచిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బులు అందజేస్తుందని తెలిసిందే. అయితే టిక్‌టాక్‌కి పోటీగా తీసుకొచ్చిన యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటికి కూడా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. షార్ట్‌ వీడియోలు తీసే క్రియోటర్లకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది. సుమారు 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

కాగా, 2021 – 2022 మధ్య వైరలైన షార్ట్‌ వీడియోలకు ఈ ఫండ్ అందించనుంది. ఈ ఆగస్టు నుంచే ఈ రివార్డులను అందించనుంది. అర్హత గల యూట్యూబ్‌ కంటెంట్ క్రియేటర్లకు సుమారు 100 డాలర్ల (సుమారు రూ. 7,400) నుంచి 10,000 డాలర్ల(సుమారు రూ.7,40,000) వరకు రివార్డులు లభించనున్నాయి. అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియోలకు ఈ రివార్డులు లభించనున్నాయి. అలాగే బోనస్‌ చెల్లింపులను క్లెయిమ్‌ చేసుకోవాలని అడుగుతోంది కంటెంట్ క్రియేటర్లను అడుగుతోంది. ఇందుకోసం ప్రతి నెల షార్ట్‌ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్‌ నిబంధనల ప్రకారం షార్ట్ వీడియోలు క్వాలిఫై అవాల్సి ఉంటుంది. టార్గెట్ వ్యూస్ పూర్తయిన వీడియోలకే ఈ బహుమతులు అందనున్నాయి. ప్రతి నెల వ్యూస్ ఆధారంగా ఈ రివార్డలు దక్కనున్నాయి. ఒకవేళ ఈ నెలలో క్వాలిఫై కాకున్నా.. వచ్చే నెలలో అర్హత సాధించినా ఈ రివార్డులను పొందవచ్చు. భారత్‌తోపాటుగా యూఎస్, యూకె, బ్రెజిల్, జపాన్, ఇండోనేషియా, నైజీరియా, మెక్సికో, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్‌ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. త్వరలో మరిన్ని దేశాలకు ఈ పోటీని విస్తరించనున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

రివార్డులు పొందాలంటే అర్హతలు..
1. యూజర్లు గత 180 రోజుల్లో అర్హత కలిగిన షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేసి ఉండాలి.
2. షార్ట్స్ వీడియో ఒరిజినల్‌ కంటెంటై ఉండాలి. అంటే వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్‌లోడ్ 3. చేయకూడదు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటి నుంచి అప్‌లోడ్ చేయకూడదు.
4. ఇతర యూట్యూబ్‌ ఛానళ్ల వీడియోలను కూడా అప్‌లోడ్‌ చేయకూడదు.
5. యూజర్లు కచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.

క్లెయిం చేయాలంటే ఎలా..
బోనస్‌ను క్లెయిం చేయాలంటే క్రియేటర్లు రెండు దశలను పూర్తిచేయాలి.
1. యూట్యూబ్ నిబంధనలు అంగీకరించాలి
2. యాడ్‌సెన్స్ ఖాతా పనిచేస్తూ ఉండాలి.

Also Read: EVExpo: ఎలక్ట్రిక్ వెహికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 6 నుంచి.. అతిపెద్ద ఈ ఈవెంట్ ఎక్కడ ఎలా నిర్వహించబోతున్నారంటే..

Space Tourists: అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లి వచ్చిన రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్‌లు ఆస్ట్రోనాట్స్ కాదా? ఎందుకు?

Water Proof Cover: మీ స్మార్ట్‌ఫోన్‌కి ఈ కవర్ వేశారంటే..ఈత కొడుతూ కూడా ఫోటోలు తీసుకోవచ్చు..ఇది ఎలా పనిచేస్తుందంటే..