Ear Buds: ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి హెచ్చరిక.. శాశ్వతంగా వినికిడి లోపం.. ఈ చిట్కాలతో మీరు సేఫ్..

ఇటీవల ప్రతీఒక్కరూ ఇయర్ బడ్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. కొంతమంది నిరంతరం వీటిని చెవుల్లో పెట్టుకునే ఉంటారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వినికిడి లోపం బారిన పడుతున్నారు. ఇటీవల యువకుల్లో ఇలాంట కేసులు ఎక్కువయ్యాయి.

Ear Buds: ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి హెచ్చరిక.. శాశ్వతంగా వినికిడి లోపం.. ఈ చిట్కాలతో మీరు సేఫ్..
Ear Buds

Updated on: Sep 12, 2026 | 9:59 AM

ఇటీవల ఎవరి చెవుల్లో చూసినా ఇయర్ బడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. బైక్‌పై వెళ్తున్నప్పుడు, బస్సు, మెట్రో, ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు కాల్స్ మాట్లాడటానికి, సాంగ్స్ వినేందుకు, వీడియో కాల్స్ కోసం ఇయర్ బడ్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. దీంతో దేశంలో వీటి వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇయర్స్ బడ్స్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. దీని వల్ల అనేక నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు ఇయర్ బడ్స్ వాడటం వల్ల చెవులకు ఎక్కువ నష్టం జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వినికిడి శక్తి తగ్గడంతో పాటు టిన్నటస్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

తక్కువ వయస్సులోనే వినికిడి లోపం

సాధారణంగా వయస్సు పెరిగాక వినికిడి లోపం వస్తుంది. పెద్ద వయస్సువారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇటీవల టినేజర్లు, జెన్ జెడ్ యువకులు కూడా వినికిడి లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఇయర్ బడ్స్ ఎక్కువ సమయం వాడటం. గతంలో వృద్దుల్లో మాత్రమే కనిపించే వినికిడి లోపం, చెవుల్లో గింగురుమనే శబ్దం వంటివి యువకుల్లో కూడా బయటపడుతున్నాయి. దీంతో యువకులు కూడా వినికిడి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఇయర్ బడ్స్ వల్ల నేరుగా వినికిడి శక్తి దెబ్బతినడంతో పాటు ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల యువకుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకసారి వినికిడి లోపం వచ్చే అది శాశ్వతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇయర్ బడ్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చెవుల్లో అలసట వస్తుంది. చెవుల్లో రింగింగ్ శబ్దాల వల్ల శాశ్వత వినికిడి లోపం బారిన పడతారు.

టిన్నిటస్ సమస్య అంటే ఏమిటి..?

ఇటీవల రోగుల్లో టిన్నిటస్ కేసులు కూడా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మీ చుట్టూ ఎలాంటి శబ్దం లేకపోయినా శబ్దం వినబడుతున్నట్లు ఫీల్ అవుతారు. దీనినే టిన్నిటస్ అని పిలుస్తారు. ఇటీవల యువకుల్లో ఈ సమస్యను ఎక్కువగా వైద్యులు గుర్తిస్తున్నారు. నిరంతం ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల మొదట శ్రవణ నాడులు అలసిపోయి.. ఆ తర్వాత శాశ్వతంగా దెబ్బతింటాయి. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్లు తక్కువగా ఉపయోగించాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే తక్కువ సమయం వాడాలి. చెవిలో నరాలు అలసట నుంచి కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. ఇయర్ బడ్స్ వీలైనంతగా తక్కువగా వినియోగించాలి. గంటల కొద్ది చెవిలో పెట్టుకుని గేమ్స్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేయకూడదు. ఇయర్ బాడ్స్ వాడుతుంటే ప్రతీ ఏడాది వినికిడి పరీక్ష చేయించుకోవాలి. వాడేటప్పుడు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us