Tech News: వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఎందుకు వస్తుందో తెలుసా.? అసలు కారణం ఏంటంటే..

|

Oct 13, 2023 | 7:56 PM

ఇదిలా ఉంటే ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ చేసే సమయంలో 'ఐ యామ్‌ నాట్ ఏ రోబోట్‌' అనే క్యాప్చాను చూశే ఉంటాం. ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసిన సమయంలో ఇలాంటి క్యాప్చా కనిపిస్తుంది. ఇలా వచ్చిన సమయంలో పక్కన ఉన్న బాక్స్‌లో టిక్‌ చేయగానే కొన్ని గ్రాఫిక్‌ బొమ్మలు డిస్‌ప్లే అవుతాయి. కారు బొమ్మలు, బ్రిడ్జిలు, సైకిల్స్‌ ఇలా బొమ్మలను గుర్తించమని ప్రశ్న వస్తుంది. సదరు పిక్చర్స్‌ను కరెక్ట్‌గా క్లిక్‌ చేస్తే వెంటనే...

Tech News: వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఎందుకు వస్తుందో తెలుసా.? అసలు కారణం ఏంటంటే..
Iam Not Robot
Follow us on

ప్రస్తుతం ఇంటర్‌నెట్ వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ ఇంటర్‌నెట్‌ను వినియోగించే రోజులు వచ్చేశాయ్‌. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ ఛార్జీలు భారీగా తగ్గడంతో నెట్ వినియోగం పెరిగింది. ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే ఇంటర్‌నెట్‌లో వెతికే రోజులు వచ్చేశాయ్‌.

ఇదిలా ఉంటే ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ చేసే సమయంలో ‘ఐ యామ్‌ నాట్ ఏ రోబోట్‌’ అనే క్యాప్చాను చూశే ఉంటాం. ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసిన సమయంలో ఇలాంటి క్యాప్చా కనిపిస్తుంది. ఇలా వచ్చిన సమయంలో పక్కన ఉన్న బాక్స్‌లో టిక్‌ చేయగానే కొన్ని గ్రాఫిక్‌ బొమ్మలు డిస్‌ప్లే అవుతాయి. కారు బొమ్మలు, బ్రిడ్జిలు, సైకిల్స్‌ ఇలా బొమ్మలను గుర్తించమని ప్రశ్న వస్తుంది. సదరు పిక్చర్స్‌ను కరెక్ట్‌గా క్లిక్‌ చేస్తే వెంటనే వెబ్‌సైట్ ఓపెన్‌ అవుతుంది. అయితే ఇంతకీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసే సమయంలో అసలు ‘ఐ యామ్‌ నాట్‌ ఏ రోబోట్‌’ అని ఎందుకు వస్తుంది.? దీని వెనకాల ఉన్న అసలు రీజన్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కస్టమర్ల ఇన్‌ఫర్మేషన్‌ భద్రత, వెబ్‌సైట్స్‌ ప్రొటెక్షన్‌ కోసమే ఈ క్యాప్చా విధానాన్ని తీసుకొచ్చారు. 2000 ఏడాది నుంచి వీటిని గూగుల్ ప్రవేశపెట్టింది. ప్రస్ఉతం అన్ని వెబ్‌సైట్స్‌ ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. రోబోల సాయంతో వెబ్‌సైట్స్‌ను ఓపెన్‌ చేయకుండా నిరోధించడానికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకేసారి వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేసినప్పుడు వెబ్‌సైట్స్‌పై ఒత్తిడి పెరిగి క్రాష్‌ అవుతాయి. సర్వర్లు డౌన్‌ అవ్వడమే కాకుండా వైరస్‌ అటాక్‌లు పెరుగుతాయి. దీనివల్ల వెబ్‌సైట్స్‌తో పాటు కస్టమర్ల సమాచారానికి భద్రత కూడా తగ్గుతుంది.

రోబోలు, ఆటోమేటెడ్‌ ప్రోగ్రామ్‌ల నుంచి ఎలాంటి హాని జరగకుండా క్యాప్చా ప్రొటెక్షన్‌ ఇస్తుంది. నిజంగా మనుషులే వెబ్‌సైట్స్‌ను ఓపెన్ చేస్తున్నారా లేదా.? అన్న విషయాన్ని తెలుసుకునేందుకే ‘ఐయామ్‌ నాట్‌ రోబో’ క్యాప్చా వస్తుంది. అలాగే ఇంటర్‌నెట్ యూజర్‌ ఉపయోగిస్తున్న డివైజ్‌లో స్టోర్‌ చేసిన కుకీస్‌లతో పాటు, అంతకుముందు సెర్చ్‌ చేసిన విషయాలను కూడా ఈ క్యాప్చా ట్రాక్‌ చేస్తుంది. వీటన్నింటినీ ట్రాక్‌ చేయడం ద్వారా ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తోందని మనిషేనని కంప్యూటర్‌కు తెలుస్తోంది. దీంతో సైబర్‌ దాడులు, హానికరమైన మాల్‌వేర్స్‌ నుంచి రక్షణ లభిస్తుంది. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో క్యాప్చా వచ్చేది కూడా ఇందుకే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..