వాట్సాప్ యూజర్లకు పండగే.. మీ ఫొటోలతో అదిరిపోయే స్టిక్కర్లు.. చాట్‌జీపీటీ సరికొత్త ఏఐ మ్యాజిక్..

వాట్సాప్ చాటింగ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త స్టిక్కర్లతో సందడి చేసేవారికి చాట్‌జీపీటీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై ఇతరుల స్టిక్కర్ల కోసం వెతకడం, బోరింగ్ ప్యాక్‌లు వాడటం పాత పద్ధతి. మీ సొంత ఫోటోలు, మీ పెట్స్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, మీ గ్రూప్ జోకులను క్షణాల్లో అదిరిపోయే పర్సనలైజ్డ్ స్టిక్కర్లుగా మార్చే సరికొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ తీసుకొచ్చింది.

వాట్సాప్ యూజర్లకు పండగే.. మీ ఫొటోలతో అదిరిపోయే స్టిక్కర్లు.. చాట్‌జీపీటీ సరికొత్త ఏఐ మ్యాజిక్..
Create Whatsapp Stickers With Chatgpt

Updated on: Aug 27, 2026 | 10:52 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ సొంత ఫోటోలు, ఆలోచనలు, ఫన్నీ జోకులను క్షణాల్లో ఆకర్షణీయమైన పర్సనలైజ్డ్ స్టిక్కర్ ప్యాక్‌లుగా మార్చుకునే సదుపాయాన్ని ఓపెన్ఏఐ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో రెడీమేడ్ స్టిక్కర్లపై ఆధారపడే పనిలేకుండా ఎవరికి వారు సొంతంగా వినూత్న స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్లను రూపొందించడం చాలా ఈజీ. యూజర్లు తమ మొబైల్‌లోని చాట్‌జీపీటీ యాప్‌ను ఓపెన్ చేసి.. Images విభాగంలోకి వెళ్లి Stickers ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ తమకు కావాల్సిన స్టిక్కర్ల వివరాలను టెక్స్ట్ ప్రాంప్ట్ రూపంలో రాయవచ్చు లేదా ఫోన్ గ్యాలరీ నుంచి నేరుగా ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. పెంపుడు జంతువుల ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, స్నేహితులు, కుటుంబ సభ్యుల జోకులు, లేదా ఏదైనా వ్యక్తిగత జ్ఞాపకాలను సైతం ఒక్క క్లిక్‌తో స్టిక్కర్ సెట్‌గా మార్చుకోవచ్చు. ఒక్కో ప్యాక్‌లో గరిష్టంగా తొమ్మిది స్టిక్కర్ల వరకు రూపొందించుకునే వెసులుబాటు ఉంది.

18 స్టైల్స్‌లో

యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఈ టూల్ 18 విభిన్నమైన విజువల్ స్టైల్స్‌ను అందిస్తుంది. యానిమే, 3D, హోలోగ్రాఫిక్ వంటి ఆకర్షణీయమైన థీమ్స్‌తో పాటు ఎమోజీలతో రీమిక్స్ చేయడం, రూపొందించిన స్టిక్కర్లను షేర్ చేయడానికి ముందే ఎడిట్ చేయడం వంటి అనేక కస్టమైజేషన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టిక్కర్లు పారదర్శక బ్యాక్‌గ్రౌండ్‌తో తయారవుతాయి కాబట్టి వివిధ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పంపినప్పుడు ఎంతో ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.

తయారైన స్టిక్కర్ ప్యాక్‌లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు నేరుగా వాట్సాప్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాట్సాప్‌లోకి పూర్తి ప్యాక్‌ను ఎక్స్‌పోర్ట్ చేయాలంటే అందులో కనీసం మూడు స్టిక్కర్లు ఉండాలి. లేదా కావాలనుకుంటే ఒక్కో స్టిక్కర్‌ను విడివిడిగా కూడా సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీని నిత్య జీవితంలో సరదా కమ్యూనికేషన్‌కు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా ఓపెన్ఏఐ ఈ గ్లోబల్ రోలౌట్‌ను పూర్తి చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us