Electricity Bill Scam: కరెంట్‌ బిల్లులతో ‘షాక్‌’ ఇస్తున్న సైబరాసురులు.. ఖాతా మొత్తం ఖల్లాస్‌! సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

| Edited By: Ravi Kiran

Nov 06, 2023 | 10:10 PM

ఇప్పటి వరకూ ఏదో ఫోన్‌ కాల్‌ చేయడమే లేక.. ఏదో లింక్‌ పంపడమో, లేదా ఏటీఎం ద్వారానో చోరీలకు పాల్పడే స్కామర్లు.. ఇప్పుడు మీ ఇంటి కరెంట్‌ బిల్లులతోనే మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? అది వారికి చాలా సులువండి. అయితే ఆ దోపిడీదారుల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకొనే టిప్స్‌ కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రిసిటీ బిల్‌ స్కామ్ ఏంటి?

Electricity Bill Scam: కరెంట్‌ బిల్లులతో ‘షాక్‌’ ఇస్తున్న సైబరాసురులు.. ఖాతా మొత్తం ఖల్లాస్‌! సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Cyber Security
Follow us on

స్కామర్లు పెచ్చుమీరుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో జనాలను దోచేస్తున్నారు. ప్రజల అవగాహన రాహిత్యం, అమాయకత్వం, భయాందోళనలే స్కామర్ల పెట్టుబడి అవుతోంది. అందివస్తున్న సాంకేతికతతో బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇప్పటి వరకూ ఏదో ఫోన్‌ కాల్‌ చేయడమే లేక.. ఏదో లింక్‌ పంపడమో, లేదా ఏటీఎం ద్వారానో చోరీలకు పాల్పడే స్కామర్లు.. ఇప్పుడు మీ ఇంటి కరెంట్‌ బిల్లులతోనే మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? అది వారికి చాలా సులువండి. అయితే ఆ దోపిడీదారుల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకొనే టిప్స్‌ కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రిసిటీ బిల్‌ స్కామ్ ఏంటి? దాని నుంచి ఎలా బయటపడొచ్చు తెలుసుకుందాం..

ఫోన్లకు మెసేజ్‌ వస్తుంది..

విద్యుత్‌ శాఖతో రిజిస్టర్‌ అయి ఉన్న మీ సెల్‌ ఫోన్‌ కు ఓ మెసేజ్‌ ను స్కామర్లు పంపుతున్నారు. విద్యుత్‌ శాఖ నుంచి వచ్చిన మెసేజ్‌ వినియోగదారులను మభ్యపెడుతున్నారు. మీరు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని, వెంటనే చెల్లించకపోతే మీ ఇంటికి విద్యుత్‌ ను నిలిపివేస్తామని, లేదా భారీ ఫైన్‌ పడుతుందని బెదిరిస్తున్నారు. వెంటనే చెల్లించడానికి కిందనున్న లింక్‌ ను క్లిక్‌ చేయమని ఆ మెసేజ్‌ లో ఉంటుంది. పొరపాటున ఆ లింక్‌పై క్లిక్‌ చేసి దానిలో అడిగిన వాటిని సమాధానాలు చెబుతూ చెల్లింపు చేయడానికి ప్రయత్నిస్తే అంతే ఇక మీ బ్యాంకు ఖాతాను కొల్లగొట్టడంతో పాటు మీ ఫోన్‌ను సైతం హ్యాక్‌ చేసేస్తున్నారు. వీరి బారి నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

చెల్లింపులు ఇలా చేయండి.. ఆన్‌లైన్ బిల్లు చెల్లింపుల కోసం నిజమైన విద్యుత్ సంస్థలు అందించిన అధికారిక వెబ్‌సైట్‌లు, యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.

ఇవి కూడా చదవండి

యూఆర్‌ఎల్‌లను తనిఖీ చేయండి.. ఏదైనా ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి ముందు, వెబ్‌సైట్ యొక్క URL “https://”తో ప్రారంభమవుతుందని నిర్ధారించుకోండి. సురక్షిత కనెక్షన్‌ని సూచించే తాళపు చిహ్నాన్ని కలిగి ఉందో లేదో తనిఖీ చేసుకోండి.

చెల్లింపు అభ్యర్థనలను ధ్రువీకరించండి.. చెల్లింపు అభ్యర్థనలు పంపినవారి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. అత్యవసర చెల్లింపు డిమాండ్లు లేదా అనుమానాస్పద సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

అధికారిక యాప్‌లను ఉపయోగించండి.. అధికారిక యాప్ స్టోర్‌ల వంటి విశ్వసనీయ మూలాల నుండి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
మీరు ఈ స్కామ్‌కు గురైనట్లయితే, వేగంగా చర్య తీసుకోండి.

యూపీఐ చెల్లింపు యాప్‌లు.. మీరు మోసాన్ని అనుమానించినట్లయితే, ఫోన్‌ పే, గూగుల పే, పేటీఎం వంటి ఇతర యూపీఐ యాప్‌ లలో హెల్ప్‌ బటన్‌ను క్లిక్‌ చేసి ప్రొబ్లమ్‌ ఇన్‌ ట్రాన్సాక‌్షన్‌పై క్లిక్‌ చేసి నివేదించండి.

కస్టమర్ కేర్ నంబర్.. సమస్యను నివేదించడానికి యూపీఐ చెల్లింపు యాప్‌ల కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించండి.

వెబ్‌ఫారమ్ సమర్పణ.. స్కామ్ సంఘటనను నివేదించడానికి, టిక్కెట్‌ను సేకరించడానికి ఫోన్‌పే వెబ్‌ఫారమ్‌ని ఉపయోగించండి.

సోషల్ మీడియా రిపోర్టింగ్.. ఫోన్‌పే యొక్క అధికారిక ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ హ్యాండిల్స్ ద్వారా మోసపూరిత సంఘటనలను నివేదించండి.

గ్రీవెన్స్ రిపోర్టింగ్.. మీకు మునుపటి ఫిర్యాదు ఉంటే, ఫిర్యాదును నివేదించడానికి లాగిన్ చేసి, టిక్కెట్ ఐడీని ఎంటర్‌ చేసి స్థితిని తెలుసుకోవచ్చు.

సైబర్ క్రైమ్ సెల్.. ఇవన్నీ చేసిన ఫలితం లేకపోతే విఫలమైతే, మోసాన్ని సమీప సైబర్ క్రైమ్ సెల్‌కు నివేదించండి లేదా [అధికారిక వెబ్‌సైట్]లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. మీరు సహాయం కోసం సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయవచ్చు.

ఇది అన్నింటికంటే బెస్ట్‌.. మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఈ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..