Oneplus Phone : వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. వారే అసలు టార్గెట్.. లాంచ్ ఎప్పుడంటే..?

|

Mar 29, 2023 | 6:00 PM

నార్డ్ సీఈ  సక్సెస్ కావడంతో ఆ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ నార్డ్ సీఈను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం నార్డ్ సీఈ 3ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

Oneplus Phone : వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. వారే అసలు టార్గెట్.. లాంచ్ ఎప్పుడంటే..?
One Plus Nord Ce 3
Follow us on

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తుంది. గతంలో ఫోన్స్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే వారు కానీ ప్రస్తుతం అన్ని అవసరాలకు ఫోన్లు ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే ముఖ్యంగా ఫోన్స్ కొనేవారు కెమెరా విషయంలో ఎక్కువ దృష్టి పెడతారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని అత్యంత టాప్ క్వాలిటీ ఫొటోలు వచ్చేలా వన్‌ప్లస్ ఫోన్లు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది వన్ ప్లస్ ఫోన్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలకు వన్‌ప్లస్ ఫోన్లు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. దీంతో మధ్య తరగతి వారిని టార్గెట్ చేస్తూ కంపెనీ నార్డ్ సిరీస్‌లో ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా నార్డ్ సీఈ  సక్సెస్ కావడంతో ఆ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ నార్డ్ సీఈను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం నార్డ్ సీఈ 3ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 4న విడుదల చేసే అవకాశం ఉంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ పేరుతో లాంచ్ చేస్తున్నామని కంపెనీ ధ్రువీకరిస్తూ టీజర్ పేజీ ఇప్పటికే వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ధర కూడా రూ.21,999గా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే స్టోరేజ్ వివరాలు ఇంకా వెల్లడించకపోయినప్పటికీ 8 జీబీ+128 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణగా నిలవనుంది. అలాగే పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్స్ అందుబాటులో ఉంటుంది. 1,800 x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఎల్‌సీడీ డిస్ప్లేతో ఈ ఫోన్ అందరినీ ఆకట్టుకుంటుంది. 2 ఎంపీ మాక్రో సెన్సార్, మరో 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫోన్ హోల్-పంచ్ కటౌట్‌లో సెల్ఫీ కెమెరా ఉంటుందని లీకైన చిత్రాల బట్టి తెలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..