Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్‌కు మరింత దగ్గర చేసేలా..!

|

Jul 18, 2024 | 9:00 PM

భారతదేశంలో అన్ని వయస్సుల వారు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారంటే వాటి క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ అనేది కచ్చితంగా ఉంటుంది. కొన్ని ఫోన్స్‌లో ఇన్‌బుల్ట్ యాప్ కింద వాట్సాప్‌ను ఇస్తున్నారు. వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా కూడా ఇటీవల కాలంలో సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ యూజర్లను ఆకర్షిస్తుంది. అందువల్ల మార్కెట్‌లో ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్‌కు పోటీగా నిలవలేకపోతున్నాయి. తాజాగా వాట్సాప్ అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడాన్ని సులభతరం చేసేలా కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్‌కు మరింత దగ్గర చేసేలా..!
New Feature In Whatsapp
Follow us on

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో అన్ని వయస్సుల వారు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారంటే వాటి క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ అనేది కచ్చితంగా ఉంటుంది. కొన్ని ఫోన్స్‌లో ఇన్‌బుల్ట్ యాప్ కింద వాట్సాప్‌ను ఇస్తున్నారు. వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా కూడా ఇటీవల కాలంలో సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ యూజర్లను ఆకర్షిస్తుంది. అందువల్ల మార్కెట్‌లో ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్‌కు పోటీగా నిలవలేకపోతున్నాయి. తాజాగా వాట్సాప్ అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడాన్ని సులభతరం చేసేలా కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు మీరు తరచూ చాట్ చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చే ఫేవరేట్స్ ఫీచర్‌ను లాంచ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తాజా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఫేవరేట్స్ ఫీచర్ వాట్సాప్‌లో తరచుగా సంప్రదించే వ్యక్తులు, సమూహాల వ్యక్తిగతీకరించిన జాబితాను రూపొందించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ జాబితా కాల్‌ల ట్యాబ్ ఎగువన సులభంగా యాక్సెస్ చేయవచ్చు. తద్వారా మీకు ఇష్టమైన కాంటాక్ట్స్‌తో కాల్స్‌ను ప్రారంభించడం సులభం అవుతుంది. అదనంగా ఫేవరేట్స్ ఫీచర్ మీ చాట్ జాబితా కోసం ఫిల్టర్‌గా ఉపయోగించవచ్చు. మీరు ఎక్కువగా చాట్ చేసే వ్యక్తుల చాట్‌లను త్వరగా వెతకడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫేవరేట్స్ ఫీచర్ కాల్స్, చాట్‌లు రెండింటిలోనూ సజావుగా ఏకీకృతం చేశారు. 

ఇవి కూడా చదవండి

ఫేవరేట్స్ ఫీచర్ యాక్టివేషష్ ఇలా

  • మీ చాట్ లిస్ట్‌లోని “ఫేవరేట్స్” ఫిల్టర్‌కు నావిగేట్ చేయవచ్చు. అనంతరం కావాల్సిన కాంటాక్ట్స్ లేదా గ్రూప్స్‌ను ఎంచుకోవచ్చు. 
  • కాల్స్ ట్యాబ్ నుంచి యాడ్ ఫేవరేట్స్ అనే ఎంపికను ఎంచుకోవచ్చు. అనంతరం మీరు కాల్‌ల కోసం సులభంగా యాక్సెస్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్స్ లేదా గ్రూప్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 
  • ఫేవరేట్స్ ఆప్షన్‌ను సెట్టింగ్‌ల ద్వారా ఎంచుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ ఫేవరేట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కాంటాక్ట్స్, గ్రూప్స్‌ను యాడ్ చేయడమే కాకుండా తరచుగా కనెక్ట్ అయ్యే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మీ ఇష్టమైన జాబితాను కూడా మార్చవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..