AI Agent: 72 గంటల్లోనే కంపెనీ ఏర్పాటు.. అన్నీ ఏఐనే చూసుకుంటుంది.. ఐడియా నుంచి సేల్స్ వరకు..

కేవలం 72 గంటల్లోనే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే.. అది ఏఐ సాయంతో మొదలుపెడితే ఎలా ఉంటుంది. అవును.. స్పేస్‌ఎక్స్ ఏఐ గ్రోక్ బాట్ ఈ ప్రయోగం చేపడుతుంది. కంపెనీ ఐడియా నుంచి అన్నీ పనులు ఏఐ ద్వారా చేపట్టనున్నారు. ఏఐనే అన్నీ నిర్ణయాలు తీసుకుంటుంది.

AI Agent: 72 గంటల్లోనే కంపెనీ ఏర్పాటు.. అన్నీ ఏఐనే చూసుకుంటుంది.. ఐడియా నుంచి సేల్స్ వరకు..
Ai

Updated on: Sep 12, 2026 | 11:36 AM

ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే నెలల కొద్ది సమయం పడుతుంది. ఉద్యోగుల నియామకం, అనుమతులు, నిధులు సమకూర్చుకునేందుకు నెలల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ కేవలం 72 గంటల్లోనే కంపెనీని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. అవును.. ఇప్పుడే ఏఐతో ఇది సాధ్యం కానుంది. ఈ మేరకు స్పేస్ ఏక్స్ ఏఐ సరికొత్త ప్రయోగానికిశ్రీకారం చుట్టింది. గ్రోక్ బాట్ గెలాక్సీ పేరుతో లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ స్పేస్ ఎక్స్ ఏఐ నిర్వహిస్తోంది. దీని ద్వారా 72 గంటల్లో ఏఐ ద్వారా కంపెనీని స్థాపించే ప్రయోగం చేపడుతోంది. ఇందులో పనులన్నీ ఏఐ ద్వారానే జరుగుతాయి. ఒక కంపెనీ ఫౌండర్‌లాగా ఆలోచించి తక్షణమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఏయే ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనే నిర్ణయాలతో పాటు కస్టమర్ సపోర్ట్, సేల్స్, వ్యాపార స్ట్రాటజీలు అన్నీ ఇదే తీసుకుంటుంది. అలాగే కంపెనీ ఐడియా, ఇంజనీరింగ్ పనులు అన్నీ ఇదే చూసుకుంటుంది. ప్రొడక్ట్స్ గురించి కస్టమర్లకు వివరించడం, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లాంటి పనులన్నీ ఇదే చేసేస్తుందన్న మాట. అలాగే కస్టమర్ల సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తుంది. ఉద్యోగుల అవసరం లేకుండానే ఈ గ్రోక్ బాట్ పనులన్నీ చక్కబెడుతుంది.

ఇప్పటివరకు కేవలం కోడింగ్ రాయడానికి, మార్కెటింగ్ స్లోగన్లు, వెబ్సైట్ బిల్డ్ చేయడానికి లేదా చిన్న చిన్న టాస్కులు పూర్తి చేయడానికి ఏఐను ఉపయోగిస్తున్నారు.  కానీ మనుషుల ప్రమేయం లేకుండానే ఒక కంపెనీని స్థాపించడం, దానిని నిర్వహించడం లాంటి పనులన్నీ ఏఐతో చేసేలా స్పేస్‌ఎక్స్ ఏఐ రూపొందించిన గ్రోక్ బాట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగాన్ని మూడు దశలుగా చేపట్టనున్నారు. తొలి రోజు  కంపెనీ ఐడియా, ఇంజినీరింగ్ పనులు చేపడుతుంది. ఎలాంటి ప్రొడక్ట్  లాంచ్ చేయాలి.. సాంకేతిక పనులను చేపడుతుంది.  ఇక రెండో రోజు నేరుగా సేల్స్, కస్టమర్ సపోర్ట్ పనులు చేపడుతుంది.  ప్రొడక్ట్ గురించి కస్టమర్లకు అర్థమయ్యేలా వివరించడం, వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించడం వంటి పనుులు చేపడుతుంది. ఇక మూడో రోజున అత్యంత కీలకమైన మార్కెటింగ్, పోస్ట్-సేల్స్ వ్యవహారాలను చూస్తుంది. మార్కెట్లోకి ప్రొడక్ట్ ను ఎలా తీసుకెళ్లాలి, కస్టమర్ కొనుగోలు చేశాక ఎలాంటి సేవలు అందించాలనే నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఒక ప్రొడక్ట్ ఐడియా నుంచి మార్కెటింగ్ చేసే వరకు ప్రతి దశలోనూ ఈ ఏఐ ఏజెంట్ కీలకంగా వ్యవహరించనుంది.
ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్ఏఐ అసలైన ఏఐ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు సిద్దమవుతోంది.

మనుషుల ప్రమేయం లేకుండానే వివిధ విభాగాల మధ్య ఎలా సమన్వయం చేసుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సేల్స్ టీమ్ సూచనలను బట్టి ప్రొడక్ట్స్‌లో మార్పులు చేయగలదా లేదా అన్నది ఈ లైవ్ స్ట్రీమ్‌లో తెలియనుంది.  ఇప్పటివరకు ఏఐ అంటే కేవలం చాట్ బాట్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఒక డిజిటల్ ఉద్యోగిగా మారనుంది. ఏఐ ఏజెంట్లు వ్యాపారాన్ని స్వయంగా నడిపించగలిగితే భవిష్యత్తులో సంస్థల పనితీరు పూర్తిగా మారిపోతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us