Tennis Olympics: చీరకట్టులో టెన్నీస్‌ ప్రపంచాన్ని ఏలిన భారతనారి.. ఆమె ఎవరో తెలుసా.. పూర్తి వివరాలు మీకోసం..

|

Jan 18, 2022 | 10:06 AM

Tennis Olympics: ఆమె భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త కోడలు. అయితేనేం.. మహిళాభ్యుదయ భావాలు కలిగి

Tennis Olympics: చీరకట్టులో టెన్నీస్‌ ప్రపంచాన్ని ఏలిన భారతనారి.. ఆమె ఎవరో తెలుసా.. పూర్తి వివరాలు మీకోసం..
Follow us on

Tennis Olympics: ఆమె భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త కోడలు. అయితేనేం.. మహిళాభ్యుదయ భావాలు కలిగి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆకాంక్షించింది. తనకు ఇష్టమైన క్రీడ టెన్నీస్‌లో అద్భుతంగా రాణించింది. ఆ కాలంలోనే ఒలింపిక్స్‌లో పాల్గొని భారత యవనికపై చెరగని ముద్ర వేసింది. అయితే, ప్రస్తుత కాలంలోని చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని మాత్రమే ధరించి ఆడుతుండగా.. ఆమె మాత్రం నాటి కాలంలో చక్కని భారతీయ వస్త్రధారణ అయిన చీరకట్టులో టెన్నీస్ ఆడి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానం చురగొంది. ఆమె ఎవరో కాదు.. టాటా వంశానికి చెందిన మెహెర్ బాయి టాటా.

ప్రస్తుత కాలంలో టెన్నీస్ ఆడే మహిళలలు టీషర్ట్స్, స్కర్ట్స్ ధరించడం చూస్తుంటారు. అలాంటి డ్రెస్‌లు అయితేనే ఆడటానికి వీలుగా ఉంటుందని వారు కూడా చెబుతుంటారు. భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసిన సమయంలో ఆమె ధరించే దుస్తులపై విపరీతమైన కామెంట్స్ వచ్చేవి. కానీ ఆమె వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు. అయితే, భారతదేశపు మొట్టమొదటి టెన్నీస్ స్టార్, ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన మొదటి మహిళా క్రీడాకారిణి మెహెర్ బాయి టాటా తన ఆటతో పాటు.. తాను ధరించిన దుస్తులతోనూ చరిత్రలో నిలిచారు.

పారిస్ ఒలింపిక్స్‌లో..
మెహెర్‌బాయి టాటా.. జంసెట్‌జీ టాటా పెద్ద కుమారుడు సర్ దొరాబ్జీ టాటా భార్య. ఆమె తండ్రి హెచ్‌జి బాబా.. ప్రముఖ విద్యావేత్త. స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు. తండ్రిబాటలోనే మెహెర్ బాయి టాటా కూడా నడిచారు. ఆమెకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. టెన్నీస్‌లో దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించారు. అయితే, ఈమె గురించి ప్రస్తుతం కొంతమందికి మాత్రమే తెలుసు. 1924 సంవత్సరంలో తొలిసారిగా భారత పూర్తి బృందంతో కలిసి పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొన్నారు. భారత జట్టులో ఏడుగురు టెన్నిస్ క్రీడాకారులు కూడా ఉండగా, అందులో మెహర్‌బాయి పేరు కూడా ఒకరు. అప్పట్లో క్రీడాకారుల ఖర్చులను ప్రభుత్వం భరించేది కాదు. దాంతో దొరాబ్జీ టాటా జట్టు ఖర్చు మొత్తాన్ని భరించారు.

ప్రతీ మ్యాచ్ చీరకట్టుతోనే..
మెహర్‌బాయిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇతర విదేశీ క్రీడాకారులు స్కర్టులు ధరించి ఆడుతుండగా, మెహర్‌బాయి మాత్రం ఎప్పుడూ చీర కట్టుకుని టెన్నిస్ ఆడేవారు. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ అది నిజం. మెహర్‌బాయి ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆమె వయసు 45 ఏళ్లు. ఒలింపిక్ రికార్డుల ప్రకారం.. ఆమె, ఆమె భాగస్వామి సలీం మొదటి రౌండ్‌లో టై పొందారు. అంతేకాదు.. మెహెర్‌బాయి వింబుల్డన్‌లో సుప్రసిద్ధమైన పేరు కలిగి ఉన్నారు.

మహిళా అభ్యున్నతికి కృషి చేశారు..
మెహెర్‌బాయి టాటా.. ముందు చూపు ఉన్నవారు. మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. మహిళలకు విద్యాభ్యాసం, బాల్య వివాహాలు, మహిళలకు ఓటు హక్కు, పర్దా పద్ధతికి వ్యతిరేకం, ఇలా ప్రతీ అంశంలో పోరాడేవారు. అంతేకాదు.. 1929లో ఆమోదించబడిన బాల్య వివాహాల నిషేధ చట్టం తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మెహెర్‌బాయి టాటా సలహదారుగా ఉన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.

Also read:

TOP 9 NEWS: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. లైవ్ వీడియో

Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌