WPL 2024, UPW vs MIW: యూపీపై ప్రతీకారానికి సిద్ధమైన ముంబై.. హర్మన్ ప్రీత్ సేనకు కీలక మ్యాచ్..

|

Mar 07, 2024 | 6:22 AM

WPL 2024, UPW vs MIW: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 14వ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ (UP Warriorz) గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్ 2024లో ఎంఐడబ్ల్యూ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌ల్లో గెలిచింది.

WPL 2024, UPW vs MIW: యూపీపై ప్రతీకారానికి సిద్ధమైన ముంబై.. హర్మన్ ప్రీత్ సేనకు కీలక మ్యాచ్..
Wpl 2024, Upw Vs Miw
Follow us on

WPL 2024, UPW vs MIW: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 14వ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ (UP Warriorz) గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్ 2024లో ఎంఐడబ్ల్యూ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే సమయంలో యూపీ వారియర్స్ 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్, ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీ వారియర్స్..

రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలు చూస్తే యూపీ వారియర్స్ దే పైచేయిగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లను కలిపి యూపీ వారియర్స్ (UPW), ముంబై ఇండియన్స్ (MIW) ఇప్పటివరకు 3 సార్లు తలపడ్డాయి. ఇందులో యూపీ వారియర్స్ 2, ముంబై ఇండియన్స్ 1 విజయం సాధించాయి. డబ్ల్యూపీఎల్ 2024 ఆరో మ్యాచ్లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ 2023లో ఇరు జట్లు 2 సార్లు తలపడగా యూపీడబ్ల్యూ-ఎంఐడబ్ల్యూ తలో విజయం సాధించాయి. డబ్ల్యూపీఎల్ 2023 పదో మ్యాచ్‌లో ఎంఐడబ్ల్యూ 8 వికెట్ల తేడాతో యూపీడబ్ల్యూపై విజయం సాధించింది. గత సీజన్ 15వ సీజన్లో రెండు జట్లు మరోసారి తలపడ్డాయి. ఈసారి పందెంలో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ముంబైపై యూపీ విజయం సాధించింది.

ఇరుజట్లు ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), కిరణ్ నవగీరే, చమరి అథపత్తు, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకూర్, అంజలి శ్రావణి.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, అమన్జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, ఎస్ సజ్నా, షబ్నిమ్ ఇస్మాయిల్, హుమైరా కాజీ, సైకా ఇషాక్.

రెండు జట్లు స్వ్కాడ్స్..

యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), కిరణ్ నవగీరే, చమరి అథపత్తు, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకూర్, అంజలి శ్రావణి, డేనియల్ వ్యాట్, తహ్లియా మెక్గ్రాత్, లక్ష్మీ యాదవ్, బృందా దినేష్, పర్శవి చోప్రా, సోపదండి యశశ్రీ, గౌహర్ సుల్తానా.

ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, అమన్జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, ఎస్ సజ్నా, షబ్నిమ్ ఇస్మాయిల్, హుమైరా కాజీ, సైకా ఇషాక్, ఇస్సీ వాంగ్, కీర్తన్ బాలకృష్ణన్, క్లోయి ట్రియోన్, ఫాతిమా జాఫర్, జింటిమణి కలితా, ప్రియాంక బాలా, అమన్దీప్ కౌర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..