ఎమర్జెన్సీ కాల్.. కట్‌చేస్తే.. సూపర్ 8 మ్యాచ్‌లకు ముందే జట్టును వీడిన డేంజరస్ ప్లేయర్..

|

Jun 18, 2024 | 5:45 PM

Romario Shepherd Left West Indies Camp: టీ20 వరల్డ్ కప్ 2024 అన్ని గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇప్పుడు ముగిశాయి. ఇక సూపర్-8 వంతు వచ్చింది. సూపర్-8 చివరి మ్యాచ్ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో కరేబియన్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు వెస్టిండీస్‌ క్యాంప్‌ నుంచి మరో వార్త బయటకు వచ్చింది. జట్టుకు చెందిన ప్రముఖ ఆల్ రౌండర్ ఆటగాడు రొమారియో షెపర్డ్ జట్టును వీడాడు. తన రెండో బిడ్డ పుట్టబోతుందనీ, అందుకే తన కుటుంబాన్ని కలవడానికి ఒకరోజు వెళ్లాడని ప్రకటించింది.

ఎమర్జెన్సీ కాల్.. కట్‌చేస్తే.. సూపర్ 8 మ్యాచ్‌లకు ముందే జట్టును వీడిన డేంజరస్ ప్లేయర్..
West Indies Cricket Board
Follow us on

Romario Shepherd Left West Indies Camp: టీ20 వరల్డ్ కప్ 2024 అన్ని గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇప్పుడు ముగిశాయి. ఇక సూపర్-8 వంతు వచ్చింది. సూపర్-8 చివరి మ్యాచ్ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో కరేబియన్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు వెస్టిండీస్‌ క్యాంప్‌ నుంచి మరో వార్త బయటకు వచ్చింది. జట్టుకు చెందిన ప్రముఖ ఆల్ రౌండర్ ఆటగాడు రొమారియో షెపర్డ్ జట్టును వీడాడు. తన రెండో బిడ్డ పుట్టబోతుందనీ, అందుకే తన కుటుంబాన్ని కలవడానికి ఒకరోజు వెళ్లాడని ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ కూడా పాల్గొనలేదు. ఇప్పుడు ఆ టీమ్‌ని వీడి ఫ్యామిలీని కలిసేందుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అతని భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సమయంలో షెపర్డ్ అతని కుటుంబంతో కలిసి ఉంటాడు.

రొమారియో షెపర్డ్ సూపర్-8 మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడా?

అయితే, రొమారియో షెపర్డ్ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. అతను రేపటిలోగా తిరిగి వచ్చి జట్టులో చేరతాడు. అతను వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ తెలిపింది.

రొమారియో షెపర్డ్ ఇంతవరకు అంతగా ఆకట్టుకోలేదు. పపువా న్యూ గినియాపై కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇది కాకుండా, అతను ఉగాండాపై 5 పరుగులు చేసి 1 వికెట్ తీశాడు. అయితే, న్యూజిలాండ్‌పై అతను 13 పరుగులు మాత్రమే చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పేలవ ఫాంలో ఉన్నా కరేబియన్ జట్టు షెపర్డ్ సూపర్-8 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది.

టీ20 ప్రపంచకప్ 2024 చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ జట్టు 16.2 ఓవర్లలో 114 పరుగులకే పరిమితమైంది. అంతర్జాతీయ టీ20లో పరుగుల పరంగా వెస్టిండీస్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. సూపర్-8 మ్యాచ్‌లకు ముందు వెస్టిండీస్ భారీ విజయం సాధించడం ద్వారా ఇతర జట్లకు బలమైన సందేశాన్ని ఇచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..