Vaibhav Suryavanshi : 19 బంతుల్లో 63 పరుగులు.. 331 స్ట్రైక్ రేట్.. ఐపీఎల్ కంటే వైభవ్ సూర్యవంశీ ఊచకోత మొదలు

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక కొత్త ఆశాకిరణం మెరిసింది. ఆ జట్టే నమ్మి కొనుగోలు చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ కప్ 2026లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Vaibhav Suryavanshi : 19 బంతుల్లో 63 పరుగులు.. 331 స్ట్రైక్ రేట్.. ఐపీఎల్ కంటే వైభవ్ సూర్యవంశీ ఊచకోత మొదలు
Vaibhav Suryavanshi

Updated on: Feb 27, 2026 | 8:27 AM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక కొత్త ఆశాకిరణం మెరిసింది. ఆ జట్టే నమ్మి కొనుగోలు చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ కప్ 2026లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇండియన్ నేవీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు ఈ పిల్లాడు ఆడుతున్నది క్రికెట్ బ్యాట్‌తోనా లేక గన్‌తోనా అన్నంతగా బౌండరీల వర్షం కురిపించాడు.

డీవై పాటిల్ బ్లూ జట్టు తరపున బరిలోకి దిగిన 14 ఏళ్ల వైభవ్, ఇండియన్ నేవీ విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని మంచులా కరిగించేశాడు. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను చేసిన మొత్తం పరుగులలో 58 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం. అతని స్ట్రైక్ రేట్ 331.58గా నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు అతను బౌలర్లను ఎంతలా ఉతికి ఆరేసాడో. వైభవ్ ఇచ్చిన ఈ మెరుపు ఆరంభంతో డీవై పాటిల్ బ్లూ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

వైభవ్ సూర్యవంశీ కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు, గత కొన్ని రోజులుగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెల మొదట్లో ముగిసిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ ఆరోసారి ఛాంపియన్‌గా నిలవడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో భారత్ తరపున అత్యధికంగా 439 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకున్నాడు. వరల్డ్ కప్ ఫామ్‌ను ఇప్పుడు డొమెస్టిక్ సర్క్యూట్‌లో కూడా కొనసాగిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గట్టి హెచ్చరికలు పంపాడు.

వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున అతను తుఫాన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అతి చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో, ధాటిగా ఆడటం క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా ప్రస్తుత భారత యువ ఆటగాళ్ల బ్యాటింగ్ చూసి ముక్కున వేలేసుకుంటున్న తరుణంలో, వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us