Vaibhav Sooryavanshi: ఆరు సిక్సులు కొడతా.. ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

15 ఏళ్ల భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన బ్లైండ్ ర్యాంకింగ్ ఛాలెంజ్‌లో ఒక్క ఓవర్‌లో ఆరు సిక్సర్లు, టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ వంటి రికార్డులను టాప్‌లో పెట్టాడు. భారీ సిక్సర్, అత్యధిక టీ20 సెంచరీలు, చివరి బంతి సిక్స్ వంటి ఆసక్తికరమైన లక్ష్యాలపై కూడా మాట్లాడాడు.

Vaibhav Sooryavanshi: ఆరు సిక్సులు కొడతా.. ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
Vaibhav Sooryavanshi

Updated on: Oct 06, 2026 | 9:42 AM

Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన హిట్టింగ్ పవర్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్‎తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 6 బోల్డ్ మానిఫెస్టేషన్స్ బ్లైండ్ ర్యాంకింగ్ ఛాలెంజ్‌లో వైభవ్ పాల్గొన్నాడు. తన భవిష్యత్ లక్ష్యాలు, డ్రీమ్ సాధనల గురించి ఎలాంటి భయం లేకుండా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఫస్ట్ ఛాయిస్.. ఓవర్‌కి ఆరు సిక్సర్లు

వైభవ్ సూర్యవంశీ ముందుకు వచ్చిన మొదటి ఆప్షన్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం. దీన్ని ఏమాత్రం ఆలోచించకుండా మొదటి స్థానంలో పెట్టేశాడు. ఇక రెండో స్థానంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదడం ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. క్రీజులోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వైభవ్, మైండ్‌సెట్ ఎంత ధైర్యంగా ఉందో ఈ ఎంపికలు స్పష్టం చేస్తున్నాయి.

రికార్డు సిక్సర్లు, సెంచరీల రికార్డులపై కన్ను

ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సిక్స్ కొట్టడం ఆప్షన్‌ను ఉంచాడు. తక్కువ వయసులోనే భారీ సిక్సర్లు కొట్టడంలో పేరుగాంచిన వైభవ్, నాలుగో స్థానంలో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదడం ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 అంతర్జాతీయ టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన వైభవ్, ఇంకా తన తొలి అంతర్జాతీయ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు.

లాస్ట్ బాల్ సిక్స్.. సూపర్ క్యాచ్

అత్యంత ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఆప్షన్‌ను వైభవ్ ఐదో స్థానంలో ఉంచాడు. ఇక ఆరో స్థానంలో క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే అద్భుతమైన క్యాచ్ పట్టడం అనే ఫీల్డింగ్ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలనే పట్టుదల ఈ కుర్రాడి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

తొలి టీ20 బెంచ్ కే పరిమితం?

వెస్టిండీస్తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఆడటం అనుమానంగానే మారింది. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆడి పసిడి పతకం సాధించిన జట్టులో వైభవ్ ఉన్నాడు. కానీ టీమ్ కాంబినేషన్ దృష్ట్యా సంజూ శామ్సన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉండటంతో వైభవ్ ఈ మ్యాచ్‌కి బెంచ్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us