Video: సచిన్‌ను అలా ఔట్ చేయడం తప్పే.. 22 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వివాదస్పద అంపైర్

Sachin Tendulkar Gabba Test: టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా సమయం గడుపుతున్నాడు. అయితే, తాజాగా ఓ అంపైర్ 22 ఏళ్ల తర్వాత చెప్పిన విషయంతో ప్రస్తుతం సచిన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

Video: సచిన్‌ను అలా ఔట్ చేయడం తప్పే.. 22 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వివాదస్పద అంపైర్
Tendulkar Wrong Decision Gabba

Updated on: Feb 25, 2026 | 11:33 AM

Umpiring Error Tendulkar Out: గబ్బా టెస్టులో సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడం ద్వారా తాను తప్పు చేశానని అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. మ్యాచ్ జరిగిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈవిషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఈమేరకు వెస్టిండీస్ మాజీ అంపైర్ మాట్లాడుతూ, ప్రజలు ఇప్పటికీ దాని గురించి తనను ప్రశ్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి, 2003-04లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, బ్రిస్బేన్‌లోని గబ్బాలో స్టీవ్ బక్నర్ సచిన్ టెండూల్కర్‌ను ఎల్బీ(LBW)గా అవుట్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కూడా 1-1తో డ్రాగా ముగిసింది.

3 పరుగుల వద్ద ఔటైన సచిన్..

సచిన్ టెండూల్కర్ 3 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ వేసిన బంతిని వదిలివేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతని ప్యాడ్‌లను తాకింది. గట్టిగా అప్పీల్ చేసిన తర్వాత, స్టీవ్ బక్నర్ సచిన్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. తరువాత టీవీ రీప్లేలు బంతి స్టంప్స్ మీదుగా వెళుతోందని నిర్ధారించాయి.

వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్నర్ మాట్లాడుతూ, “సచిన్ టెండూల్కర్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం నా తప్పు. నేటికీ, నేను అతన్ని ఎందుకు అవుట్ చేశావని ప్రజలు అడుగుతున్నారు. జీవితంలో తప్పులు జరుగుతాయి. నేను ఆ తప్పును అంగీకరించాను” అని చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలో వ్యాఖ్యత టోనీ గ్రెయిగ్, ఈ నిర్ణయాన్ని “భయంకరమైనది” అని అభివర్ణించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ 144 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇదే తొలిసారి కాదు..

టెండూల్కర్ పై బక్నర్ వివాదాస్పద నిర్ణయం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2005 లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అబ్దుల్ రజాక్ బౌలింగ్‌లో టెండూల్కర్‌ను క్యాచ్ ఇచ్చి అవుట్ చేశాడు. రీప్లేల్లో బ్యాట్, బంతి మధ్య స్పష్టమైన అంతరం కనిపించింది. కానీ, అప్పీల్ తగినంత బలంగా లేదు. అయినా, ఔటిచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది.

2024లో టెండూల్కర్‌ అభిమానులతో మాట్లాడుతూ.. “నేను బ్యాటింగ్ చేసేటప్పుడు, బక్నర్ ను వేలు ఎత్తకుండా ఉండటానికి బాక్సింగ్ గ్లౌజులు ధరించమని చెప్పండి” అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us