Yuvraj Singh Biopic: యువరాజ్ సింగ్ బయోపిక్‌కి రంగం సిద్ధం.. ‘సిక్సర్ కింగ్’ పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?

|

Aug 20, 2024 | 8:06 PM

Yuvraj Singh Biopic: మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల తర్వాత ఇప్పుడు స్టైలిష్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌పై బయోపిక్ రూపొందుతోంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖులు భూషణ్ కుమార్, రవి భాగచంద్కా నిర్మించనున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. బయోపిక్‌లో యువరాజ్ సింగ్ మైదానంలో, వెలుపల చేసిన ప్రయాణాన్ని అద్భుతమైన రీతిలో ప్రదర్శించనున్నారు.

Yuvraj Singh Biopic: యువరాజ్ సింగ్ బయోపిక్‌కి రంగం సిద్ధం.. సిక్సర్ కింగ్ పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?
Yuvraj Singh Biopic
Follow us on

Yuvraj Singh Biopic: మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల తర్వాత ఇప్పుడు స్టైలిష్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌పై బయోపిక్ రూపొందుతోంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖులు భూషణ్ కుమార్, రవి భాగచంద్కా నిర్మించనున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. బయోపిక్‌లో యువరాజ్ సింగ్ మైదానంలో, వెలుపల చేసిన ప్రయాణాన్ని అద్భుతమైన రీతిలో ప్రదర్శించనున్నారు.

రెండు ప్రపంచకప్ విజయాల వీరుడిపై సినిమా..

యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌కు తన ముఖ్యమైన కృషికి ప్రసిద్ధి చెందాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జట్టులో భాగమయ్యాడు. 2011లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో, అతను ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్‌పై ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

క్యాన్సర్‌తో పోరాటం..

అసాధారణ ప్రదర్శనలతో నిండిన యూవీ క్రికెట్ కెరీర్.. కథలో ఒక భాగం మాత్రమే. క్యాన్సర్‌పై ఆయన చేసిన పోరాటాన్ని కూడా బయోపిక్‌లో చూపించనున్నారు. ఈ బయోపిక్ ప్రకటన క్రికెట్ అభిమానుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. భూషణ్ కుమార్ మాట్లాడుతూ, “యువరాజ్ సింగ్ జీవితం ఒక ఆశాజనకమైన క్రికెటర్ నుంచి క్రికెట్ హీరోగా మారడం, నిజ జీవితంలో హీరోగా మారడం నిజంగా స్ఫూర్తిదాయకం తన అపూర్వ విజయాలు బుల్లితెరపై చెప్పాలి, వినాలి అని థ్రిల్‌గా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

యువరాజ్ సింగ్ ఏం చెప్పాడంటే?

యువరాజ్ మాట్లాడుతూ, “భూషణ్ జీ, రవి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు నా కథను చూపించడం నాకు చాలా గౌరవంగా ఉంది. క్రికెట్ అంటే నాకు ప్రేమ, అన్ని ఒడిదుడుకుల నుంచి బలాన్ని ఇచ్చింది. నేను ఈ చిత్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాను అంటూ తెలిపాడు.

సినిమాలో న‌టుడు ఎవ‌రు?

ఈ సినిమాలో యువరాజ్ సింగ్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ యూవీ పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపిస్తాడని కొందరు అభిమానులు నమ్ముతున్నారు. అదే సమయంలో, కొందరు సిద్ధాంత్ చతుర్వేది పేరును చెబుతున్నారు. ఈ రేసులో సిద్ధాంత్ ముందున్నాడు. ఇంతకుముందు కూడా క్రికెటర్‌గా నటించాడు. సిద్ధాంత్ ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ అనే వెబ్ సిరీస్‌లో పనిచేశాడు. యువరాజ్ కూడా తనపై బయోపిక్ తీస్తే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్ర పోషించాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..