Unique Records: ఎవరు మమ్మీ వీళ్లు.. వన్డే కెరీర్‌లో ఎన్నడూ డకౌట్ కాని నలుగురు.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్

Never Out On Duck in Entire ODI Career: భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడు తన కెరీర్‌లో ఎప్పుడూ సున్నా పరుగులకు ఔట్ కాలేదు. ఈ ప్లేయర్ భారత జట్టు తరపున సంవత్సరాలుగా క్రికెట్ ఆడాడు. కానీ, అతను ఎప్పుడూ సున్నా వద్ద అవుట్ కాలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Unique Records: ఎవరు మమ్మీ వీళ్లు.. వన్డే కెరీర్‌లో ఎన్నడూ డకౌట్ కాని నలుగురు.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్
Duck Out

Updated on: Sep 01, 2025 | 4:59 PM

Never Out On Duck in Entire ODI Career: క్రికెట్ చరిత్రలో పరుగుల వర్షంతోపాటు సెంచరీలతో రెచ్చిపోయిన ఎంతోమంది బ్యాటర్స్ ఉన్నారు. అయితే, ఇలాంటి వారిలో కొంతమంది తమ కెరీర్‌లో ఎప్పుడూ సున్నా వద్ద ఔట్ కాలేదు. ఈ లిస్ట్‌లో ఓ భారతీయ బ్యాటర్ ఉన్నాడు. ఈ ప్లేయర్ భారత జట్టు తరపున సంవత్సరాలుగా క్రికెట్ ఆడాడు. కానీ, అతను ఎప్పుడూ సున్నా వద్ద అవుట్ కాలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఎప్పుడూ సున్నా వద్ద ఔట్ కాలే..

భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడు తన కెరీర్‌లో ఎప్పుడూ సున్నా పరుగులకు ఔట్ కాలేదు. ఈ బ్యాటర్ మరెవరో కాదు, మాజీ లెజెండరీ ఆటగాడు యశ్‌పాల్ శర్మ. యశ్‌పాల్ శర్మ 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 89 పరుగులు. ఈ భారత బ్యాట్స్‌మన్ కూడా వన్డేల్లో ఎప్పుడూ డకౌట్ కాలేదు. ఇది ఆశ్చర్యకరం ఎందుకంటే యశ్‌పాల్ శర్మ ఆడే సమయంలో, వెస్టిండీస్ జట్టు చాలా డేంజరస్ జట్టు. ఆ దేశ బౌలర్లు ఎంతో ప్రమాదకరమైనవారు. అలాంటి సమయంలోనే సత్తా చాటాడు ఈ టీమిండియా దిగ్గజం. ఇక కెరీర్‌లో ఎప్పుడు సున్నా వద్ద ఔట్ కాని ప్లేయర్లు ఎవరో ఓసారి చూద్దాం..

1. పీటర్ కిర్స్టన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ పీటర్ కిర్‌స్టన్ మూడు సంవత్సరాలు క్రికెట్ ఆడాడు. కానీ, ఈ బ్యాట్స్‌మన్ వన్డేల్లో ఎప్పుడూ సున్నాకి అవుట్ కాలేదు. పీటర్ కిర్‌స్టన్ మూడు సంవత్సరాలలో 40 వన్డేలు ఆడి 1293 పరుగులు చేశాడు. అందులో 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పీటర్ కిర్‌స్టన్ వన్డేల్లో 6 సార్లు అజేయంగా నిలిచాడు. వన్డేల్లో పీటర్ కిర్‌స్టన్ అత్యధిక స్కోరు 97 పరుగులు.

ఇవి కూడా చదవండి

2. కెప్లర్ వెస్సెల్స్ (దక్షిణాఫ్రికా): కెప్లర్ వెస్సెల్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండింటి తరపున క్రికెట్ ఆడాడు. కెప్లర్ వెస్సెల్స్ తన 10 సంవత్సరాల కెరీర్‌లో 109 వన్డేలు ఆడాడు. అందులో అతను 1 సెంచరీ, 26 అర్ధ సెంచరీల సహాయంతో 3367 పరుగులు చేశాడు. కెప్లర్ వెస్సెల్స్ వన్డేల్లో అత్యధిక స్కోరు 107 పరుగులు. కెప్లర్ వెస్సెల్స్ తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సున్నాతో అవుట్ కాలేదు. కెప్లర్ వెస్సెల్స్ కూడా వన్డేల్లో 7 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

3. జాక్వెస్ రోడ్లాఫ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జాక్వెస్ రుడాల్ఫ్ 45 వన్డేల్లో 1174 పరుగులు చేశాడు. ఇందులో 7 హాప్ సెంచరీలు ఉన్నాయి. జాక్వెస్ రుడాల్ఫ్ వన్డేల్లో 6 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో జాక్వెస్ రుడాల్ఫ్ అత్యధిక స్కోరు 81 పరుగులు. జాక్వెస్ రుడాల్ఫ్ ఇప్పటివరకు వన్డేల్లో ఎప్పుడూ సున్నాకి అవుట్ కాలేదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us