IPL 2025: ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫినిషర్.. కొత్త పాత్రకు సిద్ధమంటూ ప్రకటన..

|

Jul 01, 2024 | 11:34 AM

Royal Challengers Bengaluru Batting Coach and Mentor: టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్‌గా పనిచేస్తోన్న కార్తీక్.. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కొత్త బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా పనిచేయనున్నాడు.

IPL 2025: ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫినిషర్.. కొత్త పాత్రకు సిద్ధమంటూ ప్రకటన..
Follow us on

Royal Challengers Bengaluru Batting Coach and Mentor: టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్‌గా పనిచేస్తోన్న కార్తీక్.. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కొత్త బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా పనిచేయనున్నాడు. సోమవారం (జులై 1)ఈ దినేష్ కార్తీక్ కీలక ప్రకటన చేశాడు. 39 ఏళ్ల కార్తీక్ IPL 2024 ముగిసిన తర్వాత ఇటీవలే అన్ని రకాల ఆటల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కార్తీక్ 2007లో ప్రారంభ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. అతని రిటైర్మెంట్ వరకు IPL ప్రతి ఒక్క ఎడిషన్‌ను ఆడాడు. అలాగే, RCBతో ఆటగాడిగా రెండు వేర్వేరు పాత్రలను పోషించేందుకు సిద్ధమయ్యాడు. 2022-24 నుంచి అద్భుతమైన ఫాంతో ఆకట్టుకున్నాడు.

2022లో ఫినిషర్ పాత్ర..

2022 సీజన్‌లో ఫినిషర్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. ఇక 2023 సీజన్‌లో మాత్రం డీలా పడ్డాడు. కార్తీక్ ఈ సంవత్సరం ప్రారంభంలో 187.36 తుఫాన్ స్ట్రైక్ రేట్‌తో 300కి పైగా పరుగులు సాధించి, లీగ్ నుంచి తప్పుకున్నాడు.

క్రిక్‌బజ్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. కోచ్‌గా మారడం ద్వారా ఆటకు తిరిగి రావాలని కోరుకున్నాను అంటూ తెలిపాడు. “కోచింగ్, కామెంటేటర్‌గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇది కనిపించేంత సులభం కాదు. కానీ, నేను దీనిని అంగీకరించాలి. RCB తోనే ఆడిన కొంతమంది ఆటగాళ్లు తిరిగి రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..