టీ20 ప్రపంచకప్‌లోని సూపర్ 12 మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఆఫ్ఘానిస్తాన్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపించారు. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ను 10.2 ఓవర్లలో కేవలం 60 పరుగులకే ఆలౌట్ అయింది.
స్కాట్లాండ్ మొదటి మూడు ఓవర్లలో 27 పరుగులు చేసి బాగానే ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ముజీబ్ బౌలింగ్‌కు రావడంతో కథ మారింది. కోయెట్జర్, కాలమ్ మెక్లోడ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. మరో రెండు బంతుల తర్వాత అతను రిచీ బెరింగ్టన్ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో స్కాట్లాండ్ నాలుగు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసి కష్టల్లో పడింది. ఆ తర్వాత ఆ జట్ట ఏ దశలోనూ ప్రతిఘటించలేదు. తర్వాతి రెండు ఓవర్లలో మాథ్యూ క్రాస్, జార్జ్ మున్సీ (25) నిష్క్రమించడంతో స్కాట్లాండ్కు వికెట్ల పతనం కొనసాగింది. మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్‌ను కూడా రషీద్ ఖాన్, ముజీబ్ ఔట్ చేశారు. దీంతో స్కాట్లాండ్ 60 పరుగులకే ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహమాన్ 5, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నజీబుల్లా జద్రాన్ 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. హజ్రతుల్లా జజాయ్ 44, రహ్మానుల్లా గుర్బాజ్ 46 రాణించండంతో 190 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్తాన్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. స్కాట్లాండ్ 60 పరుగులకే ఆలౌట్ కావటంతో ఆప్ఘాన్ 130 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది.