T20 World Cup 2026 : టీమిండియా కొంపముంచిన ఆ ముగ్గురు.. వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పుడు ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. పాయింట్ల పట్టికను చూస్తే, భారత్ ఉన్న గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

T20 World Cup 2026 : టీమిండియా కొంపముంచిన ఆ ముగ్గురు.. వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్?
T20 World Cup 2026

Updated on: Feb 24, 2026 | 8:30 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పుడు ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. పాయింట్ల పట్టికను చూస్తే, భారత్ ఉన్న గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అసలు వరల్డ్ ఛాంపియన్ అని పిలుచుకునే మన జట్టుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు దీనికి బాధ్యులు? ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే భారత జట్టును ఈ క్లిష్ట స్థితిలోకి నెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ముగ్గురు విలన్లు ఎవరో చూద్దాం.

మొదటి పేరు అభిషేక్ శర్మ. భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన ఈ ఓపెనర్, ఈ వరల్డ్ కప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆయన చేసిన పరుగులు కేవలం 15 మాత్రమే. ఇందులో వరుసగా మూడు సార్లు డకౌట్ (సున్నాకే అవుట్) అయ్యి హాట్రిక్ నమోదు చేయడం గమనార్హం. ఓపెనర్ సరైన పునాది వేయకపోవడంతో మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. జట్టు స్కోరును కనీసం ముందుకు తీసుకెళ్లలేక అభిషేక్ చతికిలపడటం టీమ్ ఇండియా కొంపముంచింది.

రెండో ఆటగాడు తిలక్ వర్మ. 2025 ఆసియా కప్ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన హీరో, ఇప్పుడు జీరోగా మారాడు. ఈ వరల్డ్ కప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 119 మాత్రమే ఉండటం, కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం తిలక్ వైఫల్యానికి నిదర్శనం. సగటు కేవలం 21.40 వద్దే ఆగిపోయింది. అభిషేక్ విఫలమైనప్పుడు మిడిల్ ఆర్డర్‌లో తిలక్ ఆదుకుంటాడని మేనేజ్మెంట్ ఆశించినా, ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

ఇక మూడో వ్యక్తి వాషింగ్టన్ సుందర్. గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా సూపర్-8 వంటి కీలక మ్యాచ్‌లో సుందర్‌కు అవకాశం ఇచ్చారు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను కాదని మరీ సుందర్‌ను తీసుకున్న మేనేజ్మెంట్ నమ్మకాన్ని ఆయన వమ్ము చేశాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనైనా మ్యాజిక్ చేస్తాడనుకుంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలా కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టీమిండియా సెమీస్ రేసులో వెనుకబడిపోయింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us