IPL 2022: టీ20 ప్రపంచకప్‌కి అతడిని ఎంపిక చేయాలి.. ప్రశంసల వర్షం కురిపించిన మాజీ దిగ్గజం..!

|

May 13, 2022 | 6:08 AM

IPL 2022: త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్యాకి జట్టులో చోటు కల్పించాలని సూచించారు మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్. ఐపీఎల్‌లో మరో

IPL 2022: టీ20 ప్రపంచకప్‌కి అతడిని ఎంపిక చేయాలి.. ప్రశంసల వర్షం కురిపించిన మాజీ దిగ్గజం..!
Sunil Gavaskar
Follow us on

IPL 2022: త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్యాకి జట్టులో చోటు కల్పించాలని సూచించారు మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్. ఐపీఎల్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే జట్టుని ప్లే ఆఫ్‌కి చేర్చడం అద్భుతమని కొనియాడారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు హార్దిక్‌పాండ్యా 11 మ్యాచ్‌ల్లో 344 పరుగులు చేశాడని ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా పరిణితి సాధించడం చూడటానికి ఎంతో బాగుందని తెలిపాడు. గుజరాత్‌ కొత్త జట్టు అయినప్పటికీ అందరికంటే మెరుగ్గా ఆడుతోందని కితాబిచ్చాడు. హార్దిక్ టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ జట్టుకి అన్నివిధాలా సహాయపడుతున్నాడని పేర్కొన్నాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలుపు, మూడు ఓటములతో నంబర్‌వన్‌లో ఉంది. ఈ సీజన్‌లో హార్దిక్‌ పాండ్య 11 మ్యాచ్‌ల్లో 344 పరుగులు, మూడు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు వికెట్లను తీసుకున్నాడు. అయితే హార్దిక్‌ గురించి సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘మరి కొద్దిరోజుల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తున్న హార్దిక్‌కు జట్టులో చోటుకల్పించాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో నూరు శాతం రాణిస్తున్నాడు. ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌ రెండో సగం మ్యాచుల నుంచి హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం లేదనేది నాకు తెలుసు. అయితే అదేమీ పెద్దగా ప్రభావం చూపదు. బౌలింగ్‌ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. నాయకుడిగా జట్టును సరైన మార్గంలో నడిపిస్తే సరిపోతుంది’ అని సునిల్ గావస్కర్ తన మనసులో మాటని వెల్లడించాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..