
Gavaskar on IND vs NZ 2026 ODI: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు నాలుగో వన్డే మ్యాచ్‌లో అతిపెద్ద ఓటమి ఎదురైంది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 100 పరుగులు కూడా చేయకుండానే ఆలౌట్ అయింది. కేవలం 89 పరుగులకే కుప్పకూలడం భారత క్రికెట్ చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది.
రాబోయే వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శన అభిమానులను కలవరపెడుతోంది. 2011 తర్వాత ప్రపంచ కప్ గెలవాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు జట్టు అస్థిర ప్రదర్శన నిరాశ కలిగిస్తోంది.
ముఖ్యంగా నాలుగో వన్డేలో టీమిండియా టాప్ ఆర్డర్ ప్రదర్శన దారుణంగా ఉంది. తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఘోర వైఫల్యం చెందింది. ఈ ఘోర పరాజయంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. వన్డేలలో ఫాలో ఆన్ నిబంధన ఉండి ఉంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి బ్యాటింగ్ చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేవారని సెటైర్ పేల్చారు.
భారత బ్యాటర్లు ఇంత చెత్త షాట్లు ఎప్పుడూ ఆడలేదని, మ్యాట్ హెన్రీ వేసినవి అద్భుతమైన బంతులేమీ కాదని గవాస్కర్ పేర్కొన్నారు. క్రీజులో కొద్దిసేపు ఓర్పుగా ఉండి ఉంటే, తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా మారేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..