గంభీర్‌‌కి కాదు.. రోహిత్‌కు క్రెడిట్ ఇవ్వాలి..సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

|

Oct 07, 2024 | 6:07 PM

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా జట్టు దూకుడుగా వ్యవహరించడానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మదేనని టీమ్ఇండియా దిగ్గజ ఆట‌గాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు . కాన్పూర్‌లో బంగ్లా జరిగిన మూడు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గంభీర్‌‌కి కాదు.. రోహిత్‌కు క్రెడిట్ ఇవ్వాలి..సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Sunil Gavaskar On Rohit Sha
Follow us on

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా జట్టు దూకుడిగా వ్యవహరించడానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మదేనని టీమ్ఇండియా దిగ్గజ ఆట‌గాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు . కాన్పూర్‌లో బంగ్లా జరిగిన మూడు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌ను రెండుసార్లు కట్టడి చేశారు. టీమిండియా బ్యాటర్లు ఒకే రోజులో ఐదు బ్యాటింగ్ రికార్డులను బద్దలు కొట్టారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌కి బాజ్‌బాల్ కారణమని చెప్పినప్పటికీ, గంభీర్ ఎప్పుడూ ఇలాంటి పద్ధతిలో ఆడలేదని ‘గాంబాల్’ ప్రస్తావన అర్ధవంతం కాదని గవాస్కర్ అన్నాడు. బదులుగా, ఈ విధానానికి రోహిత్ పేరు పెట్టాలని పేర్కొన్నాడు.

బెన్ స్టోక్స్ మరియు మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ విధానం పూర్తిగా మారిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ ఇలాగే బ్యాటింగ్ చేయడం, అతడు జట్టును కూడా దూకుడిగా నడిపించినట్లు చెప్పారు. గంభీర్ కేవలం రెండు నెలలు మాత్రమే కోచ్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. మెకల్లమ్‌లాగా గంభీర్ స్వయంగా ఈ పద్ధతిలో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదన్నారు. క్రెడిట్ ఏదైనా ఉంటే, అది కేవలం రోహిత్‌కే దక్కాలి చెప్పారు. ఈ-బాల్ లేదా దట్-బాల్ అనే పదాలను ఉపయోగించే బదులు, “గోహిత్” విధానం అని పిలవాలని కోరాడు.