IND vs SA: ఫైనల్ పోరుకు ముందే కష్టాల్లో సౌతాఫ్రికా.. కుటుంబాలతో కలిసి ఎయిర్ పోర్ట్‌లోనే..

|

Jun 28, 2024 | 1:13 PM

Plane Crash in Barbados: టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌లో జరగనుంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే బార్బడోస్‌లో పెద్ద ప్రమాదం జరిగింది. బార్బడోస్ విమానాశ్రయంలో ఒక విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ కారణంగా కుటుంబాలతో సహా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా గంటలపాటు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

IND vs SA: ఫైనల్ పోరుకు ముందే కష్టాల్లో సౌతాఫ్రికా.. కుటుంబాలతో కలిసి ఎయిర్ పోర్ట్‌లోనే..
Ind Vs Sa Barbados Plane Stuck
Follow us on

Plane Crash in Barbados: టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌లో జరగనుంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే బార్బడోస్‌లో పెద్ద ప్రమాదం జరిగింది. బార్బడోస్ విమానాశ్రయంలో ఒక విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ కారణంగా కుటుంబాలతో సహా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా గంటలపాటు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

వాస్తవానికి, దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ మ్యాచ్ కోసం బార్బడోస్ చేరుకోవలసి ఉంది. కానీ, వారు ఫ్లైట్‌ను అందుకోకముందే, బార్బడోస్‌లో ఒక ప్రైవేట్ విమానం ల్యాండింగ్ విఫలమైంది. ఈ ఘటనతో కలకలం రేగడంతో భద్రతా తనిఖీల దృష్ట్యా విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్‌, టేకాఫ్‌ను నిషేధించారు. ఈ కారణంగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా సేపు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికా ఓటమి చవిచూస్తుందా?

ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముగియడంతో, మొత్తం జట్టు తమ చివరి మ్యాచ్ కోసం బార్బడోస్‌కు బయలుదేరింది. అయితే, ట్రినిడాడ్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, బార్బడోస్ విమానాశ్రయంలో ఒక చిన్న ప్రైవేట్ విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని పైలట్ తెలుసుకున్నాడు. దాని కారణంగా విమానాశ్రయం మొత్తం మూసివేశారు. ఆ తరువాత, సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్లు వారి కుటుంబాలతో కలిసి 6 గంటల పాటు ట్రినిడాడ్‌లో చిక్కుకున్నారు. వారితో పాటు, వ్యాఖ్యాతలు, ఐసీసీ మ్యాచ్ అధికారులు కూడా విమానాశ్రయంలోనే చిక్కుకున్నారు. దీనిపై కొందరు స్పోర్ట్స్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు అక్కడి నుంచి వెళ్లగలిగిందా లేదా అనే సమాచారం ఇంకా అందలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..