సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు మోయనుంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో టెండూల్కర్ కుటుంబం మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వయంగా తన ‘X’ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
సచిన్ తన ఆనందాన్ని పంచుకుంటూ, సారా తన విద్య, అభిరుచిని ఉపయోగించి దేశ సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పారు. “నా కుమార్తె సారా టెండూల్కర్ @STF_Indiaలో డైరెక్టర్‌గా చేరడం చాలా గర్వకారణం. ఆమె యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో క్లినికల్ ఆండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య ద్వారా భారతదేశానికి సేవ చేయడం కోసం ఆమె ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది గ్లోబల్ లెర్నింగ్ ఎలా పూర్తి వృత్తంలోకి రాగలదో ప్రేరణగా నిలుస్తుంది” అని సచిన్ అన్నారు.
సచిన్ టెండూల్కర్ అనేది కేవలం ఒక పేరు కాదు, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఒక లెజెండ్. 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 34,357 పరుగులతో అతను ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించడం, 200 టెస్టులు ఆడడం వంటి అనేక అపూర్వమైన ఘనతలు అతనివి.
2011లో సచిన్ తన జీవన స్వప్నం నెరవేర్చుకున్నాడు. శ్రీలంకపై భారత్ విజయం సాధించి ICC క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆ జట్టులో ఆయన కీలక సభ్యుడు. అయితే, అతని ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. టీమ్ ఇండియాతో ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ క్యాంపెయిన్‌లలో భాగమై, అక్కడ కూడా తనదైన ముద్ర వేసాడు.
సచిన్ ఆటతోనే కాదు, ఇప్పుడు తన కుటుంబం ద్వారా సమాజానికి సేవ చేసే ప్రయత్నాలు కూడా ఈ లెజెండ్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. సారా టెండూల్కర్ STF ద్వారా తన పూర్వీకుల ఆశయాలను కొనసాగించబోతున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు.
I’m overjoyed to share that my daughter Sara Tendulkar has joined the @STF_India as Director.
She holds a Master’s degree in Clinical and Public Health Nutrition from University College London. As she embarks on this journey to empower India through sports, healthcare, and… pic.twitter.com/B78HvgbK62
— Sachin Tendulkar (@sachin_rt) December 4, 2024